CM KCR Yadadri : యాదాద్రిలో సీఎం కేసీఆర్.. స్వామి వారికి కిలో 16 తులాల బంగారం సమర్పణ

యాదాద్రి ఆల‌యంలో శ్రీల‌క్ష్మీ న‌ర‌సింహ‌స్వామిని సీఎం కేసీఆర్, ఆయ‌న స‌తీమ‌ణి శోభ ద‌ర్శించుకున్నారు. ఈ సంద‌ర్భంగా స్వామి వారికి కేసీఆర్ దంప‌తులు ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. అనంతరం.. యాదాద్రి ప్రధాన ఆలయ దివ్య విమాన గోపురానికి బంగారం కానుకగా సమర్పించి మొక్కు తీర్చుకున్నారు.

CM KCR Yadadri : యాదాద్రిలో సీఎం కేసీఆర్.. స్వామి వారికి కిలో 16 తులాల బంగారం సమర్పణ

CM KCR Yadadri : యాదాద్రి ఆల‌యంలో శ్రీల‌క్ష్మీ న‌ర‌సింహ‌స్వామిని సీఎం కేసీఆర్, ఆయ‌న స‌తీమ‌ణి శోభ ద‌ర్శించుకున్నారు. ఈ సంద‌ర్భంగా స్వామి వారికి కేసీఆర్ దంప‌తులు ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. అనంతరం.. యాదాద్రి ప్రధాన ఆలయ దివ్య విమాన గోపురానికి బంగారం కానుకగా సమర్పించి మొక్కు తీర్చుకున్నారు.

బంగారు తాపడం కోసం వారి కుటుంబం తరపున కిలో 16 తులాల బంగారం స్వామి వారికి కానుకగా ఇచ్చారు. ఈ విరాళాన్ని కేసీఆర్ మ‌నవడు హిమాన్షు అందించారు. పూజ‌ల అనంత‌రం కేసీఆర్ కుటుంబ స‌భ్యుల‌ను ఆశీర్వ‌దించి, తీర్థ ప్ర‌సాదాల‌ను అంద‌జేశారు. కుటుంబ స‌మేతంగా ద‌ర్శ‌నానికి వ‌చ్చిన కేసీఆర్‌కు ఆల‌య అర్చ‌కులు పూర్ణ‌కుంభంతో ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

సీఎం కేసీఆర్ వెంట మంత్రులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు. అంత‌కుముందు యాదాద్రి కొండకు దిగువన ఉన్న ప్రెసిడెన్షియల్ సూట్‌లో వైటీడీఏ అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష జరిపారు. కొండ కింద కొనసాగుతున్న సత్యనారాయణ వ్రత మండపం, బస్ స్టేషన్, గండి చెరువు ఆధునీకరణ పనులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌, ఆలయ అధికారులతో ఆలయ అభివృద్ధిపై సమీక్షించారు సీఎం కేసీఆర్.