రాష్ట్రపతి, ప్రధానిలకు సీఎం కేసీఆర్ లేఖ

  • Published By: madhu ,Published On : November 21, 2020 / 01:54 AM IST
రాష్ట్రపతి, ప్రధానిలకు సీఎం కేసీఆర్ లేఖ

cm kcr writes letters : భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవిద్, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వేర్వేరుగా లేఖలు రాశారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఉద్యోగ నియామకాలకు సంబంధించిన విషయాన్న ఆయన ప్రస్తావించారు. ప్రాంతీయ భాషల్లోనే నిర్వహించాలని వారిద్దరినీ సీఎం కేసీఆర్ కోరారు.



కేంద్రం పరిధిలో ఉండే అన్ని విభాగాలు యూపీఎస్సీ, రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆర్ బీఐ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షలు హిందీ, ఇంగ్లీషు మాధ్యమాల్లో నిర్వహిస్తుండడం మూలంగా..ఇంగ్లీషు మీడియంలో చదువుకోని అభ్యర్థులు, హిందీ తెలియని ఇతర రాష్ట్రాల అభ్యర్థులు కేంద్ర నియామకాల్లో తీవ్రంగా నష్టపోతున్నారని వెల్లడించారు.



అంతేగాకుండా..ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారని వారి దృష్టికి తీసుకెళ్లారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులకు సమాన అవకాశాలు లభించాలంటే..ప్రాంతీయ భాషల్లో పరీక్షలు రాసే అవకాశం కల్పించాలని సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.



తెలంగాణ ఫ్రాంతానికి చెందిన మాజీ ప్రధాని పీవీ నరసింహరావు స్మారక తపాల స్టాంప్ నకు త్వరగా అనుమతినివ్వాలని రాష్ట్రపతిని కోరారు. దక్షిణాది విడిదికి వచ్చినప్పుడు పీవీ స్మారక తపాల స్టాంప్ ను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.