Mallu Bhatti Vikramarka : రామానుజాచార్యుల ఫిలాసఫీ ప్రపంచానికి అవసరం- భట్టి

సమానత్వం గురించి చాలామంది చెబుతారు.. కానీ, దాన్ని ఆచరణలో పెట్టి వసుదైక కుటుంబం గురించి చెప్పిన గొప్ప సమతావాది రామానుజాచార్యులు అని భట్టి విక్రమార్క అన్నారు.

Mallu Bhatti Vikramarka : రామానుజాచార్యుల ఫిలాసఫీ ప్రపంచానికి అవసరం- భట్టి

Mallu Bhatti Vikramarka

Mallu Bhatti Vikramarka : తెలంగాణ సీఎల్పీ నేత మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క కుటుంబసమేతంగా శంషాబాద్ ముచ్చింతల్ లోని చిన్నజీయర్ స్వామి ఆశ్రమానికి వెళ్లారు. స్వామివారి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆశ్రమంలో సమతామూర్తి విగ్రహ ప్రతిష్టాపనకు జరుగుతున్న పనుల గురించి భట్టి విక్రమార్క అడిగి తెలుసుకున్నారు. వెయ్యేళ్ల క్రితమే సమాజంలోని అసమానతలపై పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త రామానుజాచార్యులు అని భట్టి అన్నారు. సమతామూర్తి సందేశాన్ని విశ్వవ్యాప్తంగా చేసేందుకు సంకల్పించిన చిన్నజీయర్ స్వామికి ఆయన అభినందనలు తెలిపారు. సమానత్వం గురించి చాలామంది చెబుతారు కానీ, దాన్ని ఆచరణలో పెట్టి వసుదైక కుటుంబం గురించి చెప్పిన గొప్ప సమతావాది రామానుజాచార్యులు అని భట్టి విక్రమార్క అన్నారు.

EPFO గుడ్‌న్యూస్.. గడువు పెంపు.. ఉద్యోగులకు బెనిఫిట్

” రామానుజ విగ్రహ ఏర్పాటు అద్భుతంగా జరుగుతున్నట్లుగా కనిపిస్తోంది. దాదాపు వెయ్యేళ్ల క్రితం.. ఒక మహానుభావుడు.. సమాజంలో వెనకబడిన వర్గాల కోసం ఆవేదన చెంది.. వాటికి వ్యతిరేకంగా పోరాటం చేసిన మహానుభావుడు రామానుజాచార్యులు. రామానుజల వారి విగ్రహాన్ని ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాటు చేసి.. ఆయన ఇచ్చిన సందేశం యావత్ దేశ ప్రజలకు అందేలా చేసిన చిన్నజీయర్ స్వామిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. సమానత్వం గురించి చాలా మంది మాట్లాడుతుంటారు. అలాంటి సమానత్వం, రహస్యంగా ఉంచిన మంత్రాలను ప్రజలకు చేరువ చేశారు.
మానవులందరూ సమానమే అని సమానత్వం గురించి చెప్పారు. వసుదైక కుటుంబం ఆని సమాజంలో అంతరాలు లేకుండా ఉండాలని సందేశం ఇచ్చారు. దాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి జీయర్ స్వామి మంచి ప్రయత్నం చేశారు. ప్రతీ మనిషిలో దైవత్వం.. మనషులందరూ సమానమే అనే సందేశం రామానుజల వారు ఇచ్చారు. గొప్ప ఫిలాసఫీ ఉన్న రామానుజల వారి విగ్రహం ఏర్పాటు చాలా అద్భుతంగా ఉంది. రామానుజల వారిని నేను అమితంగా గౌరవిస్తాను. ఆయన అనుసరించిన సమానత్వం నాకు ఆదర్శం.

Amazon Sale Offers : అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్.. స్మార్ట్ ఫోన్లపై 40శాతం ఆఫర్.. 4 రోజులు మాత్రమే!

రామానుజల వారు చెప్పిన సమానత్వాన్ని.. డా.బి.ఆర్.అంబేద్కర్ ఒక వ్యాసంలో రాశారు. సమానత్వం కోరుకునే వారందరూ రామానుజల వారి విగ్రహాన్ని సందర్శించాలి. చిన్నజీయర్ స్వామిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాజ. రామానుజల వారిని ప్రభావితం చేసిన 108 దేవాలయాలను అదే శైలితో నిర్మాణం చేసిన తీరు అద్భుతంగా ఉంది. వైకుంఠ ఏకాదశి రోజున జీయర్ స్వామిని కలిసి వారి ఆశీస్సులు తీసుకోవడం సంతోషంగా ఉంది.

ఫిబ్రవరి 2 నుంచి ప్రారంభం అవుతున్నా ఇప్పుడే రావడానికి ఒక కారణం ఉంది. ఫిబ్రవరిలో మధిర నియోజకవర్గ పరిధిలో పాదయాత్ర ఉండే అవకాశం ఉంది. అందుకే ముందే వచ్చి వెళ్తున్నా. దేశంలోనే కూర్చున్న విగ్రహం ఇదే అతి పెద్దది కావడం.. అందులోనూ సమానత్వం కోసం పాటు పడిన వ్యక్తి కావడం తెలంగాణకు గర్వకారణం. ఈ విగ్రహం తెలంగాణ కు ఒక ఐకాన్ గా మారనుంది” అని భట్టి విక్రమార్క అన్నారు.