Jagga Reddy : రాజీనామా చేస్తా, నో డౌట్.. టీఆర్ఎస్‌లోకి వెళ్లను-జగ్గారెడ్డి

ఈ రోజే రాజీనామా చేద్దామనుకున్నానని.. అయితే, రాజీనామా వద్దని సీనియర్ నేతలు ఫోన్ చేసి ఆపారని జగ్గారెడ్డి తెలిపారు. రానున్న రెండు, మూడు రోజుల్లో రాజీనామా చేస్తానని, ఇందులో ఎలాంటి..

Jagga Reddy : రాజీనామా చేస్తా, నో డౌట్.. టీఆర్ఎస్‌లోకి వెళ్లను-జగ్గారెడ్డి

Jagga Reddy

Jagga Reddy : తెలంగాణ కాంగ్రెస్ లో జగ్గారెడ్డి రూపంలో మరో అసంతృప్తి గళం వినిపిస్తోంది. పార్టీ నుంచి తప్పుకోవాలన్న ఆయన నిర్ణయం రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. కాగా, జగ్గారెడ్డిని బుజ్జగించేందుకు కాంగ్రెస్ సీనియర్లు రంగంలోకి దిగారు.

తన రాజీనామా అంశంపై సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఈ రోజే రాజీనామా చేద్దామనుకున్నానని.. అయితే, రాజీనామా వద్దని సీనియర్ నేతలు ఫోన్ చేసి ఆపారని జగ్గారెడ్డి తెలిపారు. రానున్న రెండు, మూడు రోజుల్లో రాజీనామా చేస్తానని, ఇందులో ఎలాంటి అనుమానం లేదని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.

Jagga Reddy: రాజీనామాపై.. కాంగ్రెస్ అధిష్టానానికి జగ్గారెడ్డి లేఖ

”కాంగ్రెస్ కు రాజీనామా విషయంలో వెనుకడుగు ఉండడు. అయితే, సొంత పార్టీ నేతలు ఆరోపించినట్లు నేను టీఆర్ఎస్ లోనూ చేరబోను. స్వతంత్రంగా కొనసాగుతూనే ప్రజాసేవ చేస్తా. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి, కాంగ్రెస్ సభ్యత్వానికి ఇవాళే రాజీనామా చేద్దామనుకున్నా. సీనియర్లు ఆపారు. అయిప్పటికీ నా నిర్ణయం మారబోదు” అని జగ్గారెడ్డి తేల్చి చెప్పారు.

Jagga Reddy Row

Jagga Reddy Row

చిన్నతనం నుండే ప్రజలకు సేవ చేసే గుణం ఉన్నవాడిని అని ఆయన చెప్పారు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం తన స్వభావం అన్నారు. ఎవరికీ భయపడను, జంకను అని అన్నారు. నాతో పార్టీ డిస్టర్బ్ అవుతుందని కొంతమంది నేతలు అంటున్నారని ఆయన వాపోయారు. నా తీరుతో పార్టీకి నష్టం రాకూడదనే బయటికి వెళ్లాలని ఆలోచనలో ఉన్నానని చెప్పారు. నాపై సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడకపోవడం బాధించిందన్నారు. తనపై కొందరు నేతలు కోవర్ట్ అనే ముద్ర వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలని కొందరు కాంగ్రెస్ పార్టీ నేతలు చూస్తున్నారని ఆరోపించారు. గాంధీ ఫ్యామిలీ అంటే తనకు ఎనలేని గౌరవం అన్నారు. నేను పార్టీ మారాలనుకుంటే నేరుగా వెళ్తా… అలాంటి ఆలోచన లేదన్నారు జగ్గారెడ్డి. కాంగ్రెస్ కు రాజీనామా చేశాక స్వతంత్రంగా ఉంటాను తప్ప వేరే పార్టీలోకి వెళ్లను అని తేల్చి చెప్పారాయన.

TPCC : సార్.. ప్లీజ్ రాజీనామా చేయొద్దన్న నేత.. జగ్గారెడ్డి ఏమన్నారంటే

”నా అంశం టీ కప్పులో తుఫాను లాంటిదని రేవంత్ రెడ్డి అంటున్నారు. నేను వెళ్లిపోవాలనే ఆయన చూస్తున్నారు. రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థిని ఎందుకు పెట్టలేదు? అన్ని స్థానాల్లో ఎమ్మెల్సీ అభ్యర్థులను పెట్టాలని సూచించా. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు అధికార పార్టీ మంత్రులను కలవకూడదా? ప్రజా సమస్యలపై సంగారెడ్డిలో మంత్రి కేటీఆర్ ని కలిశా. కాంగ్రెస్ పార్టీలో ఒక చిల్లర బ్యాచ్ ఉంది. పైరవీలు, లాబీయింగ్ లు అన్ని పార్టీల్లో ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ మిఠాయి దుకాణం” అని జగ్గారెడ్డి అన్నారు.

Revanth Reddy

Revanth Reddy

జగ్గారెడ్డి రాజీనామా వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపింది. ముడుపులు, లాబీయింగ్ ద్వారా పదవులు దక్కించుకున్న కొందరు తనపై కోవర్ట్ ముద్రవేస్తే సహించలేకే పార్టీని వీడాలనుకుంటున్నట్లు సోనియా గాంధీకి రాసిన లేఖలో జగ్గారెడ్డి తెలిపారు.