Telangana Corona : తెలంగాణలో కరోనా తగ్గుముఖం – కేంద్ర మంత్రి హర్షవర్ధన్

కేసులు తగ్గుముఖం పడుతుండడం పట్ల కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ సంతోషం వ్యక్తం చేశారు.

Telangana Corona : తెలంగాణలో కరోనా తగ్గుముఖం – కేంద్ర మంత్రి హర్షవర్ధన్

Harishrao

Union Minister Harshavardhan : తెలంగాణ రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతోంది. ఈ విషయం ఎవరో చెప్పింది కాదు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్. కేసులు తగ్గుముఖం పడుతుండడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి కావాల్సిన ఆక్సిజన్, రెమిడెసివర్ ఇంజక్షన్ లు, వ్యాక్సిన్లు, వెంటిలెటర్లు, తదితర కరోనాకు సంబంధించిన మందులు, సామాగ్రీ కోటాను పెంచి సత్వర సహాయం చేస్తామని హామీనిచ్చారు.

కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హర్షవర్ధన్ వివిధ రాష్ట్రాలతో 2021, మే 12వ తేదీ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రగతి భవన్ నుంచి సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు..మంత్రి హరీశ్ రావు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.

తెలంగాణకు కావాల్సిన వ్యాక్సిన్..ఆక్సిజన్, తదితర కోటాను మరింతగా పెంచాలని మంత్రి హరీష్ రావు కోరారు. మొదటి వేవ్ లో ఉన్న..మౌలిక వసతులను రెండో వేవ్ వరకు రాష్ట్ర ప్రభుత్వం గణనీయంగా పెంచిందనే విషయాన్ని చెప్పారాయన. అప్పుడు కేవలం 18 వేల 232 బెడ్స్ ఉంటే..ప్రస్తుతం 53 వేల 775కు పెంచామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపు మేరకు 9 వేల 213 ఆక్సిజన్ బెడ్ల సంఖ్యను 20 వేల 738కి, ఐసీయూ బెడ్లను 3 వేల 246 నుంచి..11 వేల 274కు ప్రభుత్వం పెంచిందన్నారు.

ఈ నేపథ్యంలో తెలంగాణకు కేటాయించిన 470 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను 600 మెట్రిక్ టన్నులకు పెంచాలన్నారు. అలాగే..రెమిడెసివర్ ఇంజక్షన్ లు, వ్యాక్సిన్ల కోటాను కూడా పెంచాలని మంత్రి హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. ఒడిశా తదితర సుదూర ప్రాంతాల నుంచి..కాకుండా..దగ్గరగా ఉన్న రాష్ట్రాల నుంచి ఆక్సిజన్, క్రయోజనిక్ ట్యాంకర్లను ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ అవసరాలను నోట్ చేసుకున్నామని, వెంటనే సరఫరా చర్యలను తీసుకుంటామని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ హామీనిచ్చారు.

Read More :Gurmeet Ram Rahim: కరోనా లక్షణాలతో క్షీణించిన డేరా బాబా ఆరోగ్యం.. రహస్యంగా ఆస్పత్రికి!