కరోనా ఎఫెక్ట్‌ : ప్రజాప్రతినిధులు, ఉద్యోగుల వేతనాల్లో భారీ కోత…సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం 

కరోనా ఎఫెక్ట్‌తో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారడంతో తెలంగాణ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇందుకోసం... సీఎం కేసీఆర్ ముందే చెప్పినట్లుగా ప్రజాప్రతినిధులు, ఉద్యోగుల వేతనాల్లో కోత విధించాలని డిసైడయ్యింది.

  • Published By: veegamteam ,Published On : March 30, 2020 / 08:01 PM IST
కరోనా ఎఫెక్ట్‌ : ప్రజాప్రతినిధులు, ఉద్యోగుల వేతనాల్లో భారీ కోత…సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం 

కరోనా ఎఫెక్ట్‌తో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారడంతో తెలంగాణ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇందుకోసం… సీఎం కేసీఆర్ ముందే చెప్పినట్లుగా ప్రజాప్రతినిధులు, ఉద్యోగుల వేతనాల్లో కోత విధించాలని డిసైడయ్యింది.

కరోనా ఎఫెక్ట్‌తో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారడంతో తెలంగాణ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇందుకోసం… సీఎం కేసీఆర్ ముందే చెప్పినట్లుగా ప్రజాప్రతినిధులు, ఉద్యోగుల వేతనాల్లో కోత విధించాలని డిసైడయ్యింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించిన సీఎం కేసీఆర్… ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు కార్పొరేషన్ ఛైర్మన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల జీతాల్లో 75శాతం కోత విధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల వేతనాల్లో 60శాతం, మిగతా అన్ని కేటగిరీల ఉద్యోగుల వేతనాల్లో 50శాతం కోత విధించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

ఫోర్త్ క్లాస్, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాల్లో 10శాతం,, అన్నిరకాల రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్‌లో 50శాతం, ఫోర్త్ క్లాస్ రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్‌లో 10శాతం కోత విధించనున్నారు. అలాగే..  అన్ని ప్రభుత్వరంగ సంస్థలు, ప్రభుత్వ గ్రాంటు పొందుతున్న సంస్థల ఉద్యోగుల వేతనాల్లోనూ కోత విధించనున్నారు.

కరోనా నేపథ్యంలో జీతాల్లో కోత పెట్టడంపై తెలంగాణ ఉద్యోగ సంఘాలు సానుకూలంగా స్పందించాయి. ఉద్యమ సమయం నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం వెన్నంటి నిలిచామని టీఎన్జీవో అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాల తరపున పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. కరోనాపై యుద్దంలో సర్కార్ వెంట నిలుస్తామని చెప్పారు. విపత్కప పరిస్థితుల్లో ప్రభుత్వానికి సహకరిస్తామని చెప్పారు.

తెలంగాణపై కరోనా పంజా విసురుతోంది. కరోనా కాటుకు మరో ఆరుగురు తెలంగాణ వాసులు చనిపోయారు. మృతులంతా ఈనెల 13 నుంచి 15 వరకు ఢిల్లీలో నిజాముద్దీన్‌ ప్రాంతంలోని మర్కజ్‌లో జరిగిన మత ప్రార్థనల్లో పాల్గొన్నారు. అక్కడే వీరికి కరోనా వైరస్‌ సోకినట్టు తెలుస్తోంది. అయితే వీరంతా తెలంగాణకు వచ్చిన తర్వాత ఒక్కొక్కరుగా చనిపోయారు. మత ప్రార్థనల్లో పాల్గొన్న ఇద్దరు గాంధీలో చికిత్స తీసుకుంటూ చనిపోయారు. 

మరొకరు అపోలో ఆస్పత్రిలో, ఇంకొకరు గ్లోబల్‌ ఆస్పత్రిలో చనిపోయారు. అంతేకాదు.. నిజామాబాద్‌, గద్వాలలోనూ ఒక్కొక్కరు మృతి చెందారు. అయితే వీరందరూ… కరోనా సోకిందని తెలియకముందే చనిపోయారు. మూడు రోజుల క్రితం ఖైరతాబాద్‌లో కరోనాతో చనిపోయిన వృద్ధుడు కూడా ఈ జాబితాలో ఉన్నాడు. ఖైరతాబాద్‌ వృద్ధుడికి కూడా చనిపోయే ముందు కరోనా ఉన్నట్టు తెలియలేదు. ఆ తర్వాత కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ వచ్చింది. మిగతా వారు కూడా అదే రీతిలో చనిపోయినట్లు తెలుస్తోంది.