Telangana Covid : కరోనా వైరస్‌‌ను టి.సర్కార్ ఎలా కట్టడి చేసింది

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కంట్రోల్‌లోకి వచ్చింది. కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే.. పాజిటివిటీ రేట్‌ను నియంత్రించడంలో సర్కార్‌ సక్సెస్‌ అయింది. లాక్‌డౌన్‌తో కేసులను కట్టడి చేస్తూనే.. ఇంటింటి సర్వేతో కరోనాను కంట్రోల్‌ చేసింది సర్కార్‌. ఒకప్పుడు టెస్ట్‌ చేయించుకోవాలంటేనే భయపడే జనాలకు.. ఇళ్లకే వెళ్లి పరీక్షలు నిర్వహించడం.. కరోనా మెడికల్‌ కిట్లను అందించడంలో ఆరోగ్య శాఖ సఫలీకృతమైంది.

Telangana Covid : కరోనా వైరస్‌‌ను టి.సర్కార్ ఎలా కట్టడి చేసింది

Tg Covid

COVID Cases : తెలంగాణ రాష్ట్రంలో కరోనా కంట్రోల్‌లోకి వచ్చింది. కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే.. పాజిటివిటీ రేట్‌ను నియంత్రించడంలో సర్కార్‌ సక్సెస్‌ అయింది. లాక్‌డౌన్‌తో కేసులను కట్టడి చేస్తూనే.. ఇంటింటి సర్వేతో కరోనాను కంట్రోల్‌ చేసింది సర్కార్‌. ఒకప్పుడు టెస్ట్‌ చేయించుకోవాలంటేనే భయపడే జనాలకు.. ఇళ్లకే వెళ్లి పరీక్షలు నిర్వహించడం.. కరోనా మెడికల్‌ కిట్లను అందించడంలో ఆరోగ్య శాఖ సఫలీకృతమైంది.

కరోనా పాజిటివ్‌ వచ్చిన ప్రతి వ్యక్తికి సమగ్ర చికిత్స అందించడంలో సర్కార్‌ సఫలీకృతమైంది. స్వల్ప లక్షణాలతో బాధపడుతున్నవారిని ఇంట్లోనే ఉంచి ప్రత్యేక మెడికల్‌ కిట్‌ ఇస్తోంది. మోడరేట్‌, సివియర్ లక్షణాలు ఉన్నవారిని కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో ఉంచి చికిత్స అందిస్తోంది ఆరోగ్య శాఖ. పాజిటివ్‌ వచ్చినవారు ఎవరెవరిని కలిశారో గుర్తించి వారికి కూడా పరీక్షలు చేసి చికిత్స అందిస్తున్నారు. ఫలితంగా రాష్ట్రంలో రికవరీ రేటు సుమారు 93 శాతంగా నమోదైంది. ప్రస్తుతం రాష్ట్రంలో 5 లక్షల 84 వేల మంది విజయవంతంగా కరోనా నుంచి కోలుకున్నారు. ముఖ్యంగా ఆక్సిజన్‌ కొరత తీర్చేందుకు దేశంలోనే మొదటిసారిగా ఆక్సిజన్‌ ట్యాంకర్లను ఎయిర్‌ లిఫ్ట్‌ చేసింది.

ఫీవర్ సర్వేతో కరోనాను తరిమికొట్టింది తెలంగాణ సర్కార్‌. వ్యాధి ముదరకముందే ఇళ్ల వద్దనే రోగులను గుర్తించి.. వారికి చికిత్స అందించేందుకు సీఎం కేసీఆర్‌ ఫీవర్ సర్వే పేరిట వినూత్న కార్యాచరణ ప్రకటించారు. గత నెల 6 నుంచి ఫీవర్ సర్వే కొనసాగుతోంది. వైద్య సిబ్బంది ఇంటింటికీ తిరిగి జ్వరం, ఇతర కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నవారిని గుర్తించి కిట్లు అందజేస్తున్నారు.

కరోనా నోడల్‌ కేంద్రాలు గాంధీ, టిమ్స్‌ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తూనే.. జిల్లా ఆస్పత్రులు, చెస్ట్ హాస్పిటల్, కింగ్ కోఠి ఆస్పత్రితో పాటుగా కోవిడ్ కేర్ సెంటర్లలో పేషెంట్లకు చికిత్స అందిస్తోంది ఆరోగ్య శాఖ. ఇంటింటి సర్వేలో కరోనా లక్షణాలున్నా వారికి నాలుగు లక్షలకు పైగా కిట్లు అందజేశారు. స్వల్ప లక్షణాలు ఉన్నవారిని ఇళ్లలోనే ఉంచి.. పూర్తి చికిత్స అందించింది తెలంగాణ సర్కార్. దశలవారీగా లాక్‌డౌన్‌ పొడిగిస్తూ.. కేసులు క్రమంగా తగ్గుతున్న వేళ.. ఆంక్షలను సడలిస్తూ వస్తోంది.