CS Somesh Kumar meet CM KCR : ఏపీకి వెళ్లాల్సిందేని హైకోర్టు తీర్పు..CM కేసీఆర్‌తో భేటీ అయిన CS సోమేశ్ కుమార్

తెలంగాణకు సీఎస్ సోమేశ్ కుమార్ కేటాయింపును రద్దు చేసింది. ఏపీకి వెళ్లిపోవాలంటూ హైకోర్టు ఆదేశిస్తూ..కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ ఉత్తర్వులను కోర్టు కొట్టివేసింది. డీవోపీటీ పిటిషన్ పై హైకోర్టు సీజే ఉజ్జల్ భూయాన్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో సోమేశ్ కుమార్ సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. కోర్టు కీలక తీర్పు తరువాత సీఎస్ సీఎం భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

CS Somesh Kumar meet CM KCR : ఏపీకి వెళ్లాల్సిందేని హైకోర్టు తీర్పు..CM కేసీఆర్‌తో భేటీ అయిన CS సోమేశ్ కుమార్

CS Somesh Kumar meeting with CM KCR after TS High court jedgement

CS Somesh Kumar meet CM KCR : తెలంగాణకు సీఎస్ సోమేశ్ కుమార్ కేటాయింపును రద్దు చేసింది. ఏపీకి వెళ్లిపోవాలంటూ హైకోర్టు ఆదేశిస్తూ..కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ ఉత్తర్వులను కోర్టు కొట్టివేసింది. డీవోపీటీ పిటిషన్ పై హైకోర్టు సీజే ఉజ్జల్ భూయాన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు సీజే ఉజ్జల్ భూయాన్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ప్రస్తుత పరిస్థితిపై సీఎం కేసీఆర్ తో సోమేశ్ కుమార్ ప్రగతి భవన్ లో భేటీ అయ్యారు. హైకోర్టు కీలక తీర్పు వెలువరించిన తరువాత వీరిద్దరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

CS Somesh kumar : హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్న CS సోమేశ్ కుమార్

సీఎస్ సోమేశ్ కుమార్ ను ఏపీ క్యాడర్ కు పంపించాలన్న తెలంగాణ హైకోర్టు తీర్పుతో సీఎం సీఎస్ లకు భేటీ అయి చర్చలు జరుపనున్నారు. దీనికి మరి సీఎం కేసీఆర్ ఎటువంటి సలహాలను సీఎం సోమేశ్ కుమార్ కు ఇవ్వనున్నారు? ఎటువంటి దిశా నిర్ధేశం చేయనున్నారో వేచి చూడాలి. అనంతరం సోమేశ్ కుమార్ ఏవిధంగా ముందుకు వెళ్లనున్నారో వేచి చూడాలి. ఇదిలా ఉంటే ఏపీకి వెళ్లాల్సిందేనని తెలంగాణ హైకోర్టు తీర్పుపై సోమేశ్ కుమార్ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు. హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్నారు.

High Court Key Judgment : తెలంగాణకు సీఎస్ సోమేశ్ కుమార్ కేటాయింపు రద్దు.. ఏపీకి వెళ్లిపోవాలంటూ హైకోర్టు ఆదేశం

రాష్ట్ర విభజన సమయంలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ లను వివిధ ప్రాంతాలకు అనగా ఏపీ, తెలంగాణకు కేటాయిస్తూ గతంలో కేంద్ర డీవోపీటీ ఉత్తర్వులు జారీ చేసింది. దీని సవాల్ చేస్తూ గతంలో సీఎస్ సోమేశ్ కుమార్ తెలంగాణలోనే కొనసాగుతానంటూ కేంద్ర పరిపాలన ట్రైటునల్ (సీఏటీ)ను కోరారు. ఈ మేరకు గతంలో ఉత్తర్వులు కూడా జారీ చేసింది. సీఏటీ ఉత్తర్వులను సవాల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 2017లో కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ తెలంగాణ హైకోర్టు సీజే తుది తీర్పు ఇస్తూ..సీఏటీ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేస్తూ సోమేశ్ కుమార్ ఏపీకి వెళ్లిపోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రస్తుత పరిస్థితిపై చర్చించేందుకు సోమేశ్ కుమార్ సీఎం కేసీఆర్ తో సమావేశమై చర్చిస్తున్నారు.