Morphing Heroins Photos : వీడు మామూలోడు కాదు.. టాప్ హీరోయిన్లే టార్గెట్.. ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన కోనసీమ జిల్లాకు చెందిన కేటుగాడు

టాప్ హీరోయిన్సే వాడి టార్గెట్. హీరోయిన్ల ఫోటోలు మార్ఫింగ్ చేస్తాడు. అసభ్యకర కామెంట్లు పెడతాడు. వారిని మానసికంగా వేధిస్తాడు. చివరికి వాడి పాపం పండింది. పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు.

Morphing Heroins Photos : వీడు మామూలోడు కాదు.. టాప్ హీరోయిన్లే టార్గెట్.. ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన కోనసీమ జిల్లాకు చెందిన కేటుగాడు

Morphing Heroins Photos : హీరోయిన్లు, యాంకర్లే వాడి టార్గెట్. హీరోయిన్లు, యాంకర్ల ఫోటోలు మార్ఫింగ్ చేస్తాడు. అసభ్యకర కామెంట్లు పెడతాడు. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాడు. ఇలా.. వారిని మానసికంగా వేధిస్తాడు. చివరికి వాడి పాపం పండింది. పోలీసులకు దొరికిపోయాడు. హీరోయిన్స్, యాంకర్ల ఫొటోలను మార్ఫింగ్ చేసి, అసభ్యకర కామెంట్లు చేస్తున్న ఓ వ్యక్తిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు.

నిందితుడిని అంబేద్కర్ కోనసీమ జిల్లా పాసలపూడికి చెందిన పందిరి వెంటక వీర రాజుగా పోలీసులు గుర్తించారు. హీరోయిన్స్ ను టార్గెట్ గా చేసుకునే రాజు.. వారి ఫోటోలు మార్ఫింగ్ చేసి పోస్టులు పెట్టేవాడు. యాంకర్ అనసూయను కూడా వాడు అలానే వేధించాడు. అతడి తీరుతో విసిగిపోయిన అనసూయ, ఇతర హీరోయిన్లు.. సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు కేటుగాడిని అరెస్ట్ చేశారు.

Also Read : Pavitra Lokesh: సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన పవిత్ర లోకేశ్.. అసత్య ప్రచారం అంటూ వారిపై ఫిర్యాదు..

కాగా.. సినీ నటి, యాంకర్ అనసూయని సోషల్ మీడియాలో వేధించింది ఇతడే అని పోలీసులు తెలిపారు. రాజు.. ఓ ప్రైవేట్ ఉద్యోగి. కొంతకాలంగా అనసూయని సోషల్ మీడియా ద్వారా వేధిస్తున్నాడు. అనసూయ ఫోటోలు, వీడియోలపై అసభ్యకరమైన కామెంట్లు పెట్టి వైరల్ చేస్తున్నాడు. అలాగే అనసూయ వ్యక్తిగత జీవితంపైనా అతను అభ్యంతరకర కామెంట్లు చేస్తున్నాడు. దీనిపై అనసూయ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిపై నిఘా పెట్టారు. అయితే రాజు చాకచక్యంగా సెల్‌ఫోన్ మారుస్తూ తప్పించుని తిరుగుతున్నాడు. దీంతో వారం పాటు కోనసీమ జిల్లాలోనే మకాం వేసిన సైబర్ క్రైమ్ పోలీసులు ఎట్టకేలకు రాజుని అదుపులోకి తీసుకున్నారు. రాజు.. ఫేక్ ట్విట్టర్ అకౌంట్ నుంచి 267 మంది హీరోయిన్ల ఫోటోలు పోస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

మరోవైపు.. సినీ నటి పవిత్ర లోకేష్ కూడా సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. తన గురించి, నరేశ్ గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫోటోలు మార్ఫింగ్ చేసి వైరల్ చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కొన్ని టీవీ ఛానెళ్లలో, వెబ్‌సైట్స్‌ లో ఉద్దేశపూర్వకంగా తమ గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నాయని పవిత్ర ఆరోపించారు.

 

Also Read : Naresh-Pavitra : హోటల్‌లో నరేశ్, పవిత్రా.. చెప్పుతో కొట్టడానికొచ్చిన నరేష్ మూడో భార్య..