Bjp MLA Raghunandan Rao: టీఆర్ఎస్ తానా అంటే కాంగ్రెస్ తందానా అంటోంది : బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్

తెలంగాణ అసెంబ్లీలో కేంద్రం విద్యుత్ బిల్లుపై చర్చ జరిగింది. ఈ చర్చలో టీఆర్ఎస్ తానా అంటే కాంగ్రెస్ తందాన అంటోందని కాంగ్రెస్,టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు ఒకరికొకరు భజన చేసుకుంటున్నారంటూ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ విమర్శించారు.

Bjp MLA Raghunandan Rao: టీఆర్ఎస్ తానా అంటే కాంగ్రెస్ తందానా అంటోంది : బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్

Debate in Telangana Assembly on Electricity Amendment Bill

Bjp MLA Raghunandan Rao : తెలంగాణ అసెంబ్లీలో కేంద్రం విద్యుత్ బిల్లుపై చర్చ జరిగింది. ఈ చర్చలో విద్యుత్ బిల్లుపై టీఆర్ఎస్ నేతలు పలు విమర్శలు చేశారు. విద్యుత్ మీటర్లకు మోటార్లు అమర్చటం దారుణం అంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఈ క్రమంలో విద్యుత్ సవరణ బిల్లుపై చర్చలో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ మాట్లాడుతూ..అసలు ఈ విషయంపై చర్చే అవసరం లేదని తేల్చి చెప్పారు. టీఆర్ఎస్ నేతలు, మంత్రులు చెబుతున్నవి పచ్చి అబద్ధాలు అని అన్నారు దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్.

విద్యుత్ సవరణ బిల్లుపై జరిగిన చర్చలో కాంగ్రెస్ ఎమ్మెల్యే, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై పలువివర్శలు చేశారు. కానీ రాష్ట్ర ప్రభుత్వంపై ఒక్కవిమర్శ కూడా చేయలేదు. భట్టి విక్రమార్క కేంద్రాన్ని విమర్శించటంతో సీఎం కేసీఆర్ భట్టిని పొగిడారు. ధన్యవాదాలు తెలిపారు. దీంతో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ మాట్లాడుతూ..విద్యుత్ బిల్లుపై వివరణ ఇవ్వబోతుండగా టీఆర్ఎస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తంచేశారు. బల్లలు చరుస్తూ రఘునందన్ ను మాట్లాడనివ్వకుండా చేశారు. దీనిపై రఘునందన్ అసెంబ్లీ బయట మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. విద్యుత్ బిల్లుపై తాను అసెంబ్లీలో మాట్లాడుతుంటే అడ్డుపడ్డారని..కనీసం మూడు నిమిషాలు కూడా తనను మాట్లాడనివ్వలేదంటూ ఆవేదన వ్యక్తంచేశారు. కేంద్రం విద్యుత్ బిల్లుపై బయటమాత్రం కాంగ్రెస్ కేంద్రాన్ని విమర్శిస్తుంది కానీ అసెంబ్లీలో మాత్రం టీఆర్ఎస్ ప్రభుత్వానికి వంత పాడిందని భట్టి విక్రమార్క వ్యాఖ్యలను గుర్తు చేశారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎంలు ఒకరికొకరు భజన చేసుకుంటున్నాయని విమర్శించారు. అసెంబ్లీ వేదికగా టీఆర్ఎస్ కు కాంగ్రెస్ వత్తాసు పలుకుతోందని టీఆర్ఎస్ తానా అంటే కాంగ్రెస్ తందానా అంటోందంటూ ఎద్దేవా చేశారు.

Also read : Telangana Assembly : ఫోటోల కోసమే పనిచేస్తున్నామా? అంటూ కేంద్రంపై భట్టి ఫైర్ .. కాంగ్రెస్ నేత విమర్శలపై సర్వత్రా ఆసక్తి

సెప్టెంబర్ 15, 2020లో తెలంగాణ అసెంబ్లీ కేంద్రం తీసుకొస్తున్న విద్యుత్ సవరణ బిల్లుపై తమ నిర్ణయాన్ని తెలిపిందన్నారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఈ సందర్భంగా గుర్తు చేశారు. నేడు అసెంబ్లీలో విద్యుత్ సవరణ బిల్లుపై చర్చ జరిగింది. టీఆర్ఎస్ నేతలు, మంత్రులు చెబుతున్నవి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. సబ్సిడీలు ఎత్తివేస్తున్నారు, కేంద్రం బిల్లుతో వ్యవసాయ మోటార్లకు మీటర్లు వస్తాయని పదే పదే మంత్రులు చెబుతున్నారు. 17 ఏప్రిల్ 2020లో సెక్షన్ 65 ప్రకారం .. రాష్ట్ర ప్రభుత్వం తనకు నచ్చిన లేదా, బడుగు, బలహీన వర్గాలకు సబ్సిడీ ఎత్తివేయాలని ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేశారు. ఉద్దేశపూర్వకంగానే బీజేపీపై, కేంద్ర ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు రఘునందన్.

2020లో గానీ, 2 ఆగస్టు 2022లో తీసుకొచ్చిన విద్యుత్ సవరణ బిల్లులో వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలని ఎక్కడ పేర్కొనలేదని రఘునందన్ రావు పేర్కొన్నారు. రెండుసా్రలు పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన సవరణ బిల్లులో.. రైతులకు గానీ, బడుగు బలహీన వర్గాలకుగానీ ఉచితంగా ఇవ్వకూడదని.. సబ్సిడీలు ఎత్తివేయాలని పేర్కొనలేదని క్లారిటీ ఇచ్చారు. కరెంట్ ను 2017లో భారతదేశంలో ఇచ్చే విధంగా ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నో ప్రణాళికలు తీసుకొచ్చి చాలా గ్రామాల్లో వెలుగు నింపారని ఈ సందర్భంగా దుబ్బాక ఎమ్మెల్యే గుర్తు చేశారు. 18 వేల గ్రామాల్లో 1000 రోజుల ప్రణాళికతో విద్యుత్ సరఫరా మొదలుపెట్టిందన్నారు.

Also read : CM KCR : ఆర్టీసీని అమ్మేయాలని కేంద్రం ఒత్తిడి చేస్తోంది .. అమ్మేసిన రాష్ట్రానికి రూ.1000కోట్లు ఇస్తామని ఆఫర్లు ఇస్తోంది : కేసీఆర్

విద్యుత్ సవరణ బిల్లుపై అసెంబ్లీలో లఘుచర్చ..
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్‌ సవరణ బిల్లు – పర్యవసానాలపై లఘు చర్చను టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ ప్రారంభించారు. శాసన మండలిలో ఎమ్మెల్సీ మధుసూదనాచారి ఇదే అంశంపై లఘు చర్చను ప్రారంభించారు. ఈ క్రమంలో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు లఘుచర్చలో మాట్లాడుతూ.. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టడం, బడుగు, బలహీన వర్గాలకు ఉచిత విద్యుత్ అందించడం లేదా సబ్సిడీలు ఎత్తివేయాలని విద్యుత్ సవరణ బిల్లులో ఎక్కడా ప్రస్తావించలేదని చెప్పుకొచ్చారు.

Telangana Assembly : ‘బీజేపీకి ఇంత అహంకారమా? అధికారం తలకెక్కితే కాలం సమాధానం చెబుతుంది’ : కేంద్రంపై సీఎం కేసీఆర్ ఫైర్