Covid-19: ఆ దేవుడి వల్లే కరోనాను సమర్థంగా ఎదుర్కొన్నాం: కొవిడ్‌పై డీహెచ్ గడల మరోసారి స్పందన

యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దయతో మనం కరోనా నుంచి విముక్తి పొందామని తెలంగాణ ప్రజారోగ్య సంచాలకుడు గడల శ్రీనివాసరావు అన్నారు. ఆయన రెండు రోజుల క్రితం కరోనా గురించి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన విషయం తెలిసిందే. ఏసుక్రీస్తు దయతో మనం కరోనా నుంచి విముక్తి పొందామని ఇటీవల గడల అనడంతో ఆయనను సస్పెండ్ చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్ వచ్చింది. ఇవాళ ఆయన యాదాద్రిలో లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు.

Covid-19: ఆ దేవుడి వల్లే కరోనాను సమర్థంగా ఎదుర్కొన్నాం: కొవిడ్‌పై డీహెచ్ గడల మరోసారి స్పందన

Covid-19

Covid-19: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దయతో మనం కరోనా నుంచి విముక్తి పొందామని తెలంగాణ ప్రజారోగ్య సంచాలకుడు గడల శ్రీనివాసరావు అన్నారు. ఆయన రెండు రోజుల క్రితం కరోనా గురించి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన విషయం తెలిసిందే. ఏసుక్రీస్తు దయతో మనం కరోనా నుంచి విముక్తి పొందామని ఇటీవల గడల అనడంతో ఆయనను సస్పెండ్ చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్ వచ్చింది.

ఇవాళ ఆయన యాదాద్రిలో లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… గత రెండేళ్లుగా లక్ష్మీనరసింహ స్వామి కృపతో కొవిడ్ ను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని వ్యాఖ్యానించారు. ఇప్పుడు కరోనా కొత్త వేరియంట్‌ ను కూడా ఎదుర్కొనేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. కరోనా కొత్త వేరియంట్ పై సమీక్ష జరిపామని అన్నారు.

కరోనా కొత్త వేరియంట్ గురించి ప్రజలు ఆందోళన చెందవద్దని చెప్పారు. నాలుగో దశలో కరోనా వ్యాప్తి తీవ్రంగానే ఉన్నా మరణాల సంఖ్య అధికంగా ఉండబోదని అన్నారు. కాగా, యాదాద్రి ఆలయాన్ని ప్రపంచం మొత్తం మెచ్చేలా తెలంగాణ ప్రభుత్వం తీర్చిదిద్దిందని చెప్పారు. కాగా, ఇటీవల క్రైస్తవులకు సంబంధించిన ఓ వేడుకలో పాల్గొన్న గడల శ్రీనివాస రావు మాట్లాడుతూ.. ఏసుక్రీస్తు దయ వల్లే కరోనా నయమైందని చెప్పారు. దీంతో ఆ వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో తన మాటలను వక్రీకరించారని గడల చెప్పారు.

Andhra Pradesh: ఏపీలో రూ.300 కోట్ల విలువైన గంజాయి ధ్వంసం.. కొనసాగుతున్న ‘ఆపరేషన్ పరివర్తన్’