Dhanurmasa Festivals : నేటి నుంచి యాదాద్రిలో ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభం

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నేటి నుంచి ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. శుక్రవారం (డిసెంబర్ 16,202) సాయంత్రం 6.17 గంటలకు ఉత్సవాలు మొదలవ్వనున్నాయి.

Dhanurmasa Festivals : నేటి నుంచి యాదాద్రిలో ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభం

Dhanurmasa festivals

Dhanurmasa festivals : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నేటి నుంచి ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. శుక్రవారం (డిసెంబర్ 16,202) సాయంత్రం 6.17 గంటలకు ఉత్సవాలు మొదలవ్వనున్నాయి. ఈ ఉత్సవాలను జనవరి 15వ తేదీ వరకు నెల రోజులపాటు నిర్వహించనున్నారు.

సంక్రాంతి పండుగకు ముందు చేపట్టే ధనుర్మాస ఉత్సవాల్లో గోదాదేవి మనోవల్లభుడైన శ్రీరంగనాథుడిని ఆరాధించే పర్వాలు నిర్వహించనున్నారు. ఫ్రతిరోజు ఉదయం 4.30 గంటలకు శ్రీ ఆండాల్ అమ్మవారికి ఉత్సవ సేవ నిర్వహించనున్నారు.

Droupadi Murmu Telangana Tour: 29న రాష్ట్రపతి యాదాద్రి సందర్శన .. అదేరోజు సాయంత్రం బొల్లారంలో తేనీటి విందు

అనునిత్యం ఉదయం 4.30 నుంచి 5.15 గంటల వరకు ఆలయ ముఖమండంపైన ఉత్తర భాగంలోని హాల్ లో అమ్మవారిని వేంచేపు చేసి తిరుప్పావై కార్యక్రమం నిర్వహించనున్నారు. ఉత్సవాల్లో భాగంగా జనవరి 14వ తేదీ రాత్రి 7 గంటలకు గోదా కళ్యాణం, 15వ తేదీ ఉదయం 11.30 గంటలకు ఒడి బియ్యం సమర్పించనున్నారు.