Covid-19 Booster Dose : తెలంగాణలో కోవిడ్ బూస్టర్ డోస్ పంపిణీ.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని వైద్యశాలల్లో అందుబాటులోకి

మొదటి రెండు డోసులు కోవిషీల్డ్ లేదా కోవాగ్జిన్ తీసుకున్నవారు బూస్టర్ డోస్ గా కార్బెవ్యాక్స్ ను తీసుకోవచ్చు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం గతంలో అనుమతులు ఇచ్చింది.

Covid-19 Booster Dose : తెలంగాణలో కోవిడ్ బూస్టర్ డోస్ పంపిణీ.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని వైద్యశాలల్లో అందుబాటులోకి

Covid-19 Booster Dose

Covid-19 Booster Dose : కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. కరోనా కేసులు మరోసారి పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ బూస్టర్ డోస్ పంపిణీకి సిద్ధమైంది. రాష్ట్రంలో బుధవారం నుంచి కోవిడ్ బూస్టర్ డోస్ పంపిణీ ప్రారంభం కానుంది. హైదరాబాద్ కు చెందిన బయోలాజికల్-ఈ అభివృద్ధి చేసిన కార్బెవ్యాక్స్ వ్యాక్సిన్లను స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది. ప్రస్తుతం 5 లక్షల డోసులను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది.

మొదటి రెండు డోసులు కోవిషీల్డ్ లేదా కోవాగ్జిన్ తీసుకున్నవారు బూస్టర్ డోస్ గా కార్బెవ్యాక్స్ ను తీసుకోవచ్చు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం గతంలో అనుమతులు ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలతోపాటు భారత్ లోనూ కరోనా కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో బూస్టర్ డోస్ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ క్రమంలో టీకాల పంపిణీపై కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసింది.

COVID-19 cases: దేశంలో కొత్తగా 7,633 కరోనా కేసులు

కావాలంటే రాష్ట్రాలే స్వయంగా కొనుగోలు చేయాలని ఉచిత సలహా ఇచ్చింది. దీంతో ప్రజల సంక్షేమం దృష్ట్యా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. బయోలాజికల్-ఈ అభివృద్ధి చేసిన కార్బెవ్యాక్స్ టీకాలను సేకరించింది. రాష్ట్రవ్యాప్తంగా పీహెచ్ సీలు, యూపీహెచ్ సీల్లో కోవిడ్ టీకాలు అందుబాటులో ఉండనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా గత నెల మార్చి రెండో వారం నుంచే కరోనా కేసులు పెరిగాయి.

ఈ క్రమంలో దేశంలో కోవిడ్ టీకాల పంపిణీ బాధ్యత నుంచి కేంద్ర ప్రభుత్వం తప్పుకుంది. మార్చి రెండో వారం నుంచే తెలంగాణకు కోవిడ్ టీకాలు సరఫరా చేయడం ఆపేసింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టీ.హరీశ్ రావు మార్చి 17న వైద్య అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేవలం 6 వేల కరోనా డోసులు మాత్రమే అందుబాటులో ఉన్నాయని అధికారులు
మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

Covid- 19 Cases: ఆ రెండు రాష్ట్రాల్లో కరోనా డేంజర్ బెల్స్.. భారీగా పాజిటివ్ కేసులు.. కేంద్రం కీలక నిర్ణయం

దీంతో వెంటనే వ్యాక్సిన్లు సరఫరా చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి హరీశ్ రావు కోరారు. అదే రోజు రాష్ట్ర ప్రభుత్వం తరపున కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయకు లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వ వినతిని కేంద్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టింది.  దీంతో మార్చి నెలాఖరుకు ఒక్క డోసు టీకా కూడా లేకుండా పోయింది.

అప్పటి నుంచి కేంద్రం కరోనా వ్యాక్సిన్ సరఫరాను ఆపేసింది. టీకాలను పంపిణీ చేసేది లేదని ఏప్రిల్ 7న కేంద్ర మంత్రి తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు బయోలాజికల్-ఈ సంస్థ నుంచి 15 లక్షల డోసుల కార్బెవ్యాక్స్ వ్యాక్సిన్లు సేకరించి, పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.