హైదరాబాద్ ల్యాబ్ లో డ్రగ్స్ తయారీ

  • Edited By: madhu , August 18, 2020 / 11:40 AM IST
హైదరాబాద్ ల్యాబ్ లో డ్రగ్స్ తయారీ

హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపుతున్నాయి. ఎవరికీ తెలియకుండా..పోలీసుల కన్నుగప్పి భారీగా డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠా గుట్టురట్టయ్యింది. ఏకంగా ల్యాబ్ లోనే డ్రగ్స్ తయారు చేస్తుండడం గమనార్హం. జిన్నారం ప్రాంతంలో ఓ ల్యాబ్ లో డ్రగ్స్ తయారు చేస్తున్న ఘరానా ముఠా కార్యకలాపాలను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజిన్స్ (డీఆర్ఐ) విభాగం బహిర్గతం చేసింది.హైదరాబాద్ తో పాటు ముంబైలో ఒకేసారి దాడులు నిర్వహించి మాదకద్రవ్యాలను, ముడిసరుకును స్వాధీనం చేసుకున్నారు. డీఆర్ఐ అధికారులు. తొలుత ముంబైలో దాడులు నిర్వహించి..భారీగా ముడిసరుకును స్వాధీనం చేసుకుంది. తొలుత ముంబైలో భారీగా మెప్రోడోన్ ను స్వాధీనం చేసుకున్నారు.ప్రైవేటు ట్రావెల్స్ సరుకు రవాణా బస్సులో హైదరాబాద్ నుంచి ముంబైకు సరుకును తరలించినట్లు గుర్తించారు. మెపిడ్రోన్ తో పాటు, కెటమైన్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో రూ. 47 కోట్ల విలువైన 210 కిలోల మెపిడ్రోన్, 10 కిలోల కెటమైన్, 31 కిలోల ఎపిడ్రిన్, రూ. 50 కోట్ల విలువైన 250 కిలోల మెప్రిడ్రోన్ తయారీ ముడిసరుకును లభ్యం చేసుకున్నారని తెలుస్తోంది. రూ. 45 లక్షల విలువైన అమెరికా డాలర్లు, యూరో కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.