EAMCET Counseling : ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. ఎన్ఐటీ ప్రవేశాల జోసాకు సమాంతరంగా

మూడు విడతల్లో సీట్లు పొందిన విద్యార్థులు ఆగస్టు 8, 9 తేదీల్లో సంబంధిత కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని నవీన్ మిట్టల్ పేర్కొన్నారు. ఆగస్టు 8న ప్రైవేట్ కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలను విడుదల చేస్తామని తెలిపారు.

EAMCET Counseling : ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. ఎన్ఐటీ ప్రవేశాల జోసాకు సమాంతరంగా

EAMCET Engineering

EAMCET Engineering Counseling : తెలంగాణలో ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సొలింగ్ షెడ్యూల్ విడుదల అయింది. మూడు విడతల్లో కౌన్సిల్ జరుగనుంది. జూన్ 26 నుంచి ఆగస్టు 9 వరకు కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వెంకటరమణ, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ షెడ్యూల్ ను విడుదల చేశారు.

మాసబ్ ట్యాంక్ లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో టీఎస్ ఎంసెట్ అడ్మిషన్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంజనీరింగ్ ప్రవేశాల కౌన్సిలింగ్ షెడ్యూల్ రూపకల్పనపై చర్చించి ఖరారు చేశారు. జూన్ 26 నుంచి తొలి విడత కౌన్సిలింగ్, జూలై 21 నుంచి రెండో విడత, ఆగస్టు 2 నుంచి తుది విడత కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది.

TS EAMCET Results 2023: తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో అనిరుధ్‌కు ఫస్ట్ ర్యాంక్

మూడు విడతల్లో సీట్లు పొందిన విద్యార్థులు ఆగస్టు 8, 9 తేదీల్లో సంబంధిత కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని నవీన్ మిట్టల్ పేర్కొన్నారు. ఆగస్టు 8న ప్రైవేట్ కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలను విడుదల చేస్తామని తెలిపారు. ఇంజనీరింగ్ సీట్లు మిగలకుండా ఐఐటీలు, ఎన్ఐటీల్లో ప్రవేశాలకు కల్పించే జోసా కౌన్సిలింగ్ కు సమాంతరంగా ఎంసెట్ కౌన్సెలింగ్ ను నిర్వహించేలా షెడ్యూల్ ను రూపొందించారు.

జూన్ 18న జేఈఈ అడ్వాన్స్ డ్ ఫలితాలు రానున్నాయి. జూన్ 19వ తేదీ నుంచే జోసా రిజిస్ట్రేషన్ ప్రారంభం కానుంది. ఎంసెట్ ఇంజనీరింగ్ తొలి విడత కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ జూన్ 26 నుంచి ప్రారంభమవుతుంది. ఏటా జోసా సీట్ల కేటాయింపు 6 విడతల్లో నిర్వహించనున్నారు. ఈ ఏడాది జోసా కౌన్సెలింగ్ తో పాటే ఎంసెట్ కౌన్సెలింగ్ కూడా జరుగనుంది.

Inter Weightage Canceled : ఎంసెట్ లో ఇంటర్ వెయిటేజీ శాశ్వతంగా రద్దు.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

ఎంసెట్ తొలి 1000 ర్యాంకర్లలో అత్యధికులు జోసా కౌన్సెలింగ్ లో పాల్గొని, ఎన్ఐటీలు, ఐఐటీల్లో సీట్లు పొందుతుండటంతో వారు ఎంసెట్ ర్యాంకుల ద్వారా చేరిన సీట్లన్నీ మిగిలిపోతున్నాయి. ఆయా సీట్లను ఇతరులకు కేటాయించలేని పరిస్థితి గత కొంతకాలంగా నెలకొంటుంది. దీంతో వ్యూహాత్మకంగా షెడ్యూల్ ఖరారు చేశారు.