Minister KTR : హనుమంతుని గుడి లేని ఊరు లేదు.. కేసీఆర్ సంక్షేమ పథకం అందని ఇల్లు లేదు : మంత్రి కేటీఆర్

సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ లో రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించారు. పట్టణంలో రూ.27 కోట్ల 51 లక్షల విలువైన అభివృద్ధి పనులను హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్ కుమార్ తో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.

Minister KTR : హనుమంతుని గుడి లేని ఊరు లేదు.. కేసీఆర్ సంక్షేమ పథకం అందని ఇల్లు లేదు : మంత్రి కేటీఆర్

Minister KTR (1)

Minister KTR : హనుమంతుని గుడి లేని ఊరు లేదు.. కేసీఆర్ సంక్షేమ పథకం అందని ఇల్లు లేదని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. హుస్నాబాద్ కల్పవల్లి గౌరవెల్లి రిజర్వాయర్ అని అభివర్ణించారు. నాలుగేళ్లలోనే కాళేశ్వరం సహా అన్ని రిజర్వాయర్లు నిర్మించిన అపర భగీరథుడు కేసీఆర్ అని కొనియాడారు. ఎన్నడో నెహ్రూ కొబ్బరికాయ కొట్టిపోతే నిన్న మొన్నటి దాకా కాకతీయ కాలువను తవ్వుతూనే ఉన్నారని పేర్కొన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ లో రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించారు.

పట్టణంలో రూ.27 కోట్ల 51 లక్షల విలువైన అభివృద్ధి పనులను హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్ కుమార్ తో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం హుస్నాబాద్ ఆర్టీసీ డిపో గ్రౌండ్ లో బీఆర్ఎస్ పార్టీ ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో పాల్గొని మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ నాడు ఎదైనా ప్రాజెక్టు నిర్మించాలంటే జీవిత కాలం పట్టేదని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో రోజు 9 గంటల కరెంట్ అని 6 గంటలు కూడా ఇచ్చేవారు కాదని విమర్శించారు. ప్రస్తుతం 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నామని చెప్పారు.

Minister KTR : కాంగ్రెస్, బీజేపీని తప్పకుండా ప్రజలు బండకేసి కొడతారు : మంత్రి కేటీఆర్

బంజారాహిల్స్ లో ఎట్లా నీళ్లు వస్తున్నాయో.. అట్లా తండాలో కూడా తాగు నీళ్లు వస్తున్నాయని గిరిజనులు ధైర్యంగా చెబుతున్నారని పేర్కొన్నారు. 40 ఏళ్ల తండా వాసుల గోసను తీర్చి పంచాయతీలుగా మార్చిన ఘనత కేసీఆర్ ది అన్నారు. కేసీఆర్ కంటే ముందున్న ఏ ముఖ్యమంత్రికి అడబిడ్డల కష్టాలు తీర్చాలనే ఆలోచన లేదని చెప్పారు. ఏటా 14 లక్షల మంది వధువులకు లక్షా 16 వేల రూపాయలు అందిస్తున్నామని తెలిపారు.

హుస్నాబాద్ అభివృద్ధికి రూ.25 కోట్లు మంజూరు చేశామని వెల్లడించారు. తొమ్మిదేళ్ల క్రితం తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం వచ్చినట్లే కేంద్రంలో మోదీ ప్రభుత్వం వచ్చిందన్నారు. మోదీ పెద్ద పెద్ద మాటలు, డైలాగులు చెప్పి పెద్ద నోట్లు రద్దు చేసి కొంపముంచారని విమర్శించారు. నాడు గ్యాస్ ధర రూ.400 ఉంటే ప్రస్తుతం రూ.1200 అయిందన్నారు. గ్యాస్ ధర రూ.400 ఉన్ననాడు నాలుగు వందల తిట్లు తిట్టిన మోదీని ఇప్పుడు ఎన్ని తిట్లు తిట్టాలన్నారు.

KTR: ఇక కదలాలి.. వచ్చే ఎన్నికలకు గులాబీ సైన్యం సమరోత్సాహంతో కదంతొక్కాలి: కేటీఆర్

ఇక్కడ వినోద్ కుమార్ ను ఓడగొట్టి ఒక్క పిచ్చోన్ని గెలిపించుకున్నారని వ్యాఖ్యానించారు. మసీదులు తవ్వుదాం.. శవం ఎళ్తే మీది.. శివమ్ వస్తే మాదంటాడు అని చెప్పారు. నాలుగున్నర ఏళ్లల్లో ఒక్క మంచి పని చేసిన మొఖం ఈ ఎంపీకి ఉందా ? అని ప్రశ్నించారు. ఈ పిచ్చోన్ని ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు. రైతుల కష్టాలు పెంచిన మోదీ దేవుడా? 700 మంది రైతులను చంపినోడు దేవుడా ? అని ప్రశ్నించారు.

కాంగెస్ వారిని చూస్తే నవ్వాలో ఏడ్వాలో తెలియడం లేదన్నారు. ఒక్కసారి అవకాశం అంటున్న కాంగ్రెస్ కు 75 ఏళ్లలో పదిసార్లు అవకాశం ఇస్తే ఏం చేశారని ప్రశ్నించారు. నిన్న, మొన్నటి దాకా సావగొట్టిన దౌర్బగ్య పార్టీ కాంగ్రెస్.. మరొక అవకాశం ఇవ్వాలని అడగడం సిగ్గుచేటన్నారు. బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి మాత్రమే కాదని.. భారత రైతు సమితి కూడా అని అన్నారు. వడ్లు తడిసినా, మొలకెత్తినా కొనమని అధికారులకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు.