బీకేర్ ఫుల్ : ఓటు వేసేందుకు వస్తే అరెస్ట్

దొంగ ఓట్లను అరికట్టేందుకు ఎన్నికల సంఘం టెక్నాలజీని వినియోగిస్తుంది. మున్సిపల్ ఎన్నికల్లో దేశంలోనే తొలిసారిగా తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఫేస్‌ రికగ్నైజేషన్‌ యాప్‌ను

  • Published By: veegamteam ,Published On : January 22, 2020 / 01:47 AM IST
బీకేర్ ఫుల్ : ఓటు వేసేందుకు వస్తే అరెస్ట్

దొంగ ఓట్లను అరికట్టేందుకు ఎన్నికల సంఘం టెక్నాలజీని వినియోగిస్తుంది. మున్సిపల్ ఎన్నికల్లో దేశంలోనే తొలిసారిగా తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఫేస్‌ రికగ్నైజేషన్‌ యాప్‌ను

దొంగ ఓట్లను అరికట్టేందుకు ఎన్నికల సంఘం టెక్నాలజీని వినియోగిస్తుంది. దేశంలోనే తొలిసారిగా తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఫేస్‌ రికగ్నైజేషన్‌ యాప్‌ను వినియోగిస్తుంది. పైలట్ ప్రాజెక్టుగా కొంపల్లిలోని 10 పోలింగ్‌ బూత్‌లలో ఈ యాప్‌ను వాడుతోంది. ఈ యాప్ ద్వారా దొంగ ఓట్లు వేసే వారికి ఈసీ చెక్‌ పెట్టనుంది. టీ-యాప్, ఈ-గవర్నెన్స్‌ సహకారంతో తెలంగాణ ఎన్నికల సంఘం ఈ ఓట‌ర్ రిక‌గ్నైజేష‌న్ యాప్‌ను రూపొందించింది.

కొంపల్లి పరిధిలోని పోలింగ్ బూత్ నెంబర్‌ 13,.. 15, .. 16 .. 21, ..22,..  23,.. 24 , .. 27,..  31, 32 లో నమోదైన ఓటర్ల వివరాలను యాప్‌లో పొందుపరిచారు. ఓటరు పోలింగ్ బూత్ లోకి రాగానే.. ఈ యాప్ లో  ఫోటో తీసి సెండ్ చేస్తారు. అతను దొంగ ఓటు వేయడానికి వస్తే అక్కడ ఏర్పాటు చేసిన స్క్రీన్‌పై ఫేక్‌ ఓటర్‌ అని కనిపిస్తుంది. వెంటనే ఎన్నికల అధికారులు అతన్ని పోలీసులకు అప్పగిస్తారు.

* ఓటు వేసిన వ్యక్తుల ఫొటోలు అందులో భద్రపరుస్తారు. 
* ఇది పైలెట్ ప్రాజెక్ట్ కాబట్టి ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత ఆ ఫొటోల డేటాను డిలీట్ చేస్తారు
* వాటిని భద్ర పరచడం కానీ, మరే ఇతర కార్యక్రమాల కోసం వాటిని వినియోగించబోమని ఈసీ స్పష్టం చేసింది. 
* ఫొటోలు తీసిన మొబైల్ ఫోన్ నుంచి, అలాగే సర్వర్ నుంచి కూడా ఆ ఫొటోల డేటాను డిలీట్ చేస్తారు.
* ఓటరు పోలింగ్ స్టేషన్‌లోకి వచ్చిన తర్వాత అక్కడున్న మొబైల్ ఫోన్‌తో ఓటర్ ఫొటో తీస్తారు. 
* అప్పటికే ఆ మొబైల్ ఫోన్‌కు అనుసంధానమై ఉన్న ఎన్నికల కమిషన్ డేటాలో చెక్ చేస్తారు. 
* ఆ రెండు ముఖాలు సరిపోల్చుకుంటారు. 
* ఆ ఓటర్ సరైన వ్యక్తి అని నిర్ధారించుకున్న తర్వాత ఓటు వేసేందుకు అంగీకరిస్తారు.
* దొంగ ఓట్లను అరికట్టడమే లక్ష్యం

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు పోలింగ్ స్టార్ట్ అయ్యింది. సోమవారం(జనవరి 22,2020) ఉదయం 7 గంటలకు పోలింగ్ షురూ అయ్యింది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది.

9 కార్పొరేషన్లలోని 324 డివిజన్‌లలో పోలింగ్ జరుగుతోంది. కార్పొరేషన్లలో 14 వందల 38 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అటు 120 మున్సిపాలిటీల్లోని 2 వేల 647 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 53 లక్షల 50 వేల 255 మంది ఓటర్లున్నారు. మున్సిపాలిటీల్లో 40 లక్షల 36 వేల 346  మంది ఓటర్లుండగా కార్పొరేషన్‌లలో 13 లక్షల 13 వేల 909 మంది ఓటర్లున్నారు.

Also Read : బొజ్జ ఉన్నవాళ్లకే హార్ట్ అటాక్ ప్రమాదాలు ఎక్కువ