First Dose Vaccine Bandh : తెలంగాణలో ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ బంద్

తెలంగాణలో రేపటి నుంచి ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ నిలిపివేయాలని రాష్ట్ర ఆరోగ్యశాఖ నిర్ణయించింది. కేవలం రెండో డోస్ వారికే మాత్రమే వ్యాక్సిన్ ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు.

First Dose Vaccine Bandh : తెలంగాణలో ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ బంద్

First Dose Vaccine Bandh

First dose corona vaccine bandh : తెలంగాణలో రేపటి నుంచి ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ నిలిపివేయాలని రాష్ట్ర ఆరోగ్యశాఖ నిర్ణయించింది. కేవలం రెండో డోస్ వారికే మాత్రమే వ్యాక్సిన్ ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రటరీ సోమేష్ కుమార్ నుంచి ఆదేశాలు రావడంతో ఆరోగ్యశాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణలో ప్రస్తుతం టీకా కొరత ఉంది. కేంద్రం నుంచి అవసమైన మోతాదులో వ్యాక్సిన్ సరఫరా లేదు. దీంతో ఫస్ట్ డోస్ బ్రేక్ ఇచ్చి రెండో డోస్ కంప్లీట్ చేయాలని అధికారులు నిర్ణయించారు. సెకండ్ డోస్ తీసుకోవాల్సిన వారు సుమారు 11లక్షల మంది ఉండటంతో ఈనెల 15 వరకు ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ కు బ్రేక్ ఇవ్వనున్నారు.

రాష్ట్రంలో కోవీషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్ల కొరత రోజురోజుకు ఎక్కువవుతోంది. గత కొంతకాలంగా కేంద్రం నుంచి డోస్ లు ఎక్కువ మోతాదులో రాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఆరోగ్యశాఖ ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్నవారికే వ్యాక్సినేషన్లు ఇస్తామని చెప్పడంతో క్యూ లైనులు కడుతున్నారు. అయినా కూడా ఇప్పటికే వ్యాక్సిన్ సెంటర్ల దగ్గర క్యూ లైన్ లు కడుతున్నారు.

అయితే ఇప్పటివరకు తెలంగాణలో 50లక్షల 39 వేల మందికి ఫస్ట్, సెకండ్ డోస్ వ్యాక్సిన్లు ఇచ్చారు. నిన్న కూడా చాలా తక్కువ వ్యాక్సినేషన్ ఇచ్చారు. ఎందుకంటే గతవారం రోజులుగా రాష్ట్రానికి, హైదరాబాద్ కు చేరుకున్న వ్యాక్సిన్ల సంఖ్య చాలా తక్కువగా ఉంది. కేవలం 75 వేల కోవాగ్జిన్లు, 3లక్షల 90 వేల కోవీషీల్డ్ వ్యాక్సిన్లు ఈ మధ్య కాలంలో రాష్ట్రానికి చేరుకున్నాయి. తర్వాత వ్యాక్సిన్లు వచ్చినా కూడా అడపాదడపా తక్కువ మోతాదులో వచ్చాయి.