మీ సేవా కేంద్రాల వద్ద బారులు తీరిన వరద బాధితులు…కరోనా వ్యాపిస్తుందని భయాందోళన

  • Published By: bheemraj ,Published On : November 18, 2020 / 01:45 PM IST
మీ సేవా కేంద్రాల వద్ద బారులు తీరిన వరద బాధితులు…కరోనా వ్యాపిస్తుందని భయాందోళన

mee seva centers Flood victims : వరద సాయం కోసం జనం అల్లాడుతున్నారు. తెల్లవారు జామునుంచే మీ సేవా కేంద్రాల వద్ద పడిగాపులు పడుతున్నారు. కిలో మీటర్ల మేర బారులు తీరారు. సర్వర్లు పనిచేయడం లేదంటూ పలుచోట్ల మీసేవా కేంద్రాలు మూతబడ్డాయి.



అప్లికేషన్లు ఇచ్చి వెళ్లిపోవాలంటున్న నిర్వాహకులు చెబుతుండడంతో ఏం చేయాలో అర్థం కాక బాధితులు సతమతమవుతున్నారు. గంటగంటకు రద్దీ పెరుగుతుండడంతో.. మీ సేవా కేంద్రాలకు పోలీసుల రక్షణ కల్పిస్తున్నారు. పబ్లిక్‌ను కంట్రోల్‌ చేయలేక పోలీసులు సైతం ఇబ్బంది పడుతున్నారు.



హైదరాబాద్ జియాగూడలోనూ మీ సేవా సెంటర్ల దగ్గర వరద బాధితులు పడిగాపులు కాస్తున్నారు. భారీగా తరలివచ్చిన బాధితులు పేర్లు నమోదు చేసుకునేందుకు గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. వరద బాధితుల్లో ఎక్కువమంది మహిళలు ఉన్నారు. చిన్నారులను తీసుకుని వచ్చి…క్యూ కష్టాలు పడుతున్నారు.



https://10tv.in/osmaniya-university-engineering-semister-exams-new-time-table-will-be-released-to-check-details/
హైదరాబాద్ మీ సేవా కేంద్రాల దగ్గర వరద బాధితుల పరిస్థితి దయనీయంగా ఉంది. మీ సేవా కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకునేందుకు గంటల తరబడి పడిగాస్తున్న బాధితులు.. కరోనాకు సంబంధించి కనీస జాగ్రత్తలు పాటించడం లేదు.



కిక్కిరిసి ఉన్న క్యూ లైన్లలో భౌతికదూరమన్న మాటే కనిపించడం లేదు. వృద్ధులు సైతం ప్రమాదకర పరిస్థితుల మధ్య మీ సేవా కేంద్రాల దగ్గర నిరీక్షిస్తున్నారు.


మీ సేవా కేంద్రాల దగ్గర వరద బాధితులు పడరాని పాట్లు పడుతున్నారు. కొందరు నిన్నటి నుంచి ఇంటికి వెళ్లకుండా పడిగాపులు కాస్తుంటే..మరికొందరు తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి పడిగాపులు పడుతున్నారు. పిల్లలు, వృద్ధుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది.