Gangavva : కరోనా వ్యాక్సిన్ తీసుకున్న గంగ‌వ్వ‌.. నొప్పి తట్టుకోలేక చిన్నపిల్లలా కేకలు.. నవ్వులు పూయిస్తున్న వీడియో

యూట్యూబ్ స్టార్, బిగ్ బాస్ ఫేమ్ గంగవ్వ కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. మల్యాలలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం(మార్చి 30,2021) ఆమెకు టీకా ఇచ్చారు. అయితే వ్యాక్సిన్ ఇచ్చే స‌మ‌యంలో నొప్పి భ‌రించ‌లేక గంగ‌వ్వ చిన్న పిల్ల‌ల్లా గట్టిగా కేక‌లు పెట్టారు. ఇంజెక్షన్ గుచ్చగానే గట్టిగా అరిచారు.

Gangavva : కరోనా వ్యాక్సిన్ తీసుకున్న గంగ‌వ్వ‌.. నొప్పి తట్టుకోలేక చిన్నపిల్లలా కేకలు.. నవ్వులు పూయిస్తున్న వీడియో

Gangavva

gangavva takes first shot of covid vaccine : యూట్యూబ్ స్టార్, బిగ్ బాస్ ఫేమ్ గంగవ్వ కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. మల్యాలలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం(మార్చి 30,2021) ఆమెకు టీకా ఇచ్చారు. అయితే వ్యాక్సిన్ ఇచ్చే స‌మ‌యంలో నొప్పి భ‌రించ‌లేక గంగ‌వ్వ చిన్న పిల్ల‌ల్లా గట్టిగా కేక‌లు పెట్టారు. ఇంజెక్షన్ గుచ్చగానే అరిచారు. దీనికి సంబంధించిన వీడియోను మై విలేజ్ షో టీమ్.. గంగవ్వ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

గంగవ్వ కోవిడ్ వ్యాక్సిన్ రియాక్షన్ పేరిట వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. అయ్యో.. గంగవ్వ ఎప్పుడూ ఇంజెక్షన్ తీసుకోలేదా? ఎందుకంత భయం? అని కొందరు కామెంట్ చేశారు. మరికొందరేమో ఆమె పెదవులకు, చర్మానికి ఏమైంది? పెదవులెందుకు తెల్లగా పాలిపోయాయి? అంటూ ప్రశ్నలు లేవనెత్తారు.

కాగా..గంగ‌వ్వ జ్వ‌రంతో పాటు ఒళ్లు నొప్పుల‌తో బాధ‌ప‌డుతున్న‌ట్టు తెలుస్తుంది. వ్యాక్సిన్ ఇచ్చిన త‌ర్వాత ల‌క్ష‌ణాలు ఇలాగే ఉంటాయ‌ని, ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని డాక్టర్లు అంటున్నారు.

గంగవ్వ… తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు. బిగ్ బాస్ సీజ‌న్ 4 ఫేమ్ గంగ‌వ్వ అతి త‌క్కువ స‌మ‌యంలోనే అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందారు. మై విలేజ్ షో అనే యూట్యూబ్ కార్య‌క్ర‌మంతో పాపులార్ కాగా, బిగ్ బాస్ షోతో ఆమెకు మ‌రింత ఆద‌ర‌ణ ద‌క్కింది. రీసెంట్‌గా వైల్డ్ డాగ్ సినిమా ప్ర‌మోష‌న్‌లో భాగంగా నాగార్జున‌తో క‌లిసి ఫుల్ ఎంట‌ర్‌టైన్ చేశారు గంగ‌వ్వ‌.

ప్ర‌స్తుతం దేశ‌మంత‌టా క‌రోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేప‌థ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. 60ఏళ్లు పైడిన వారితో పాటు 45 ఏళ్లు నిండి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారందరికీ టీకాలు వేస్తున్నారు. ప్రముఖులతో పాటు సాధారణ ప్రజలూ టీకా తీసుకుంటున్నారు.

మన దేశంలో జనవరి నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయ్యింది. తొలి దశలో కరోనా వారియర్స్‌కు టీకాలు వేశారు. డాక్టర్లు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు వ్యాక్సిన్ వేసుకున్నారు. మార్చి 1 నుంచి రెండో దశ వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. 60ఏళ్లు పైబడిన వారితో పాటు 45 ఏళ్లు నిండి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఏప్రిల్ 1 నుంచి మూడో దశ వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది. 45 ఏళ్లు నిండిన అందరికీ వ్యాక్సిన్ ఇస్తారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా కరోనా వ్యాక్సిన్ వేస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో మాత్రం డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. మొదటి డోస్ తీసుకున్న 28 రోజులకు రెండో డోస్ తీసుకోవాల్సి ఉంటుంది.

 

View this post on Instagram

 

A post shared by Milkuri Gangavva (@gangavva)