హైదరాబాద్ మురికి కాల్వలో కేజీన్నర బంగారం.. బ్యాగ్ దొరికింది, గోల్డ్ పోయింది.. అసలేం జరిగింది

  • Published By: naveen ,Published On : October 13, 2020 / 03:14 PM IST
హైదరాబాద్ మురికి కాల్వలో కేజీన్నర బంగారం.. బ్యాగ్ దొరికింది, గోల్డ్ పోయింది.. అసలేం జరిగింది

Gold Smuggling

banjara hills : హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని ఓ మురుగునీటి కాలువలో.. కేజీన్నర బంగారం కొట్టుకుపోయింది. నమ్మటానికి కాస్త సందేహంగా అనిపిస్తున్నా.. ఇదే జరిగిందని చెబుతున్నాడు వీఎస్ జ్యువెలరీ షాప్ సేల్స్ మెన్. గోల్డ్ షాప్ నుంచి బంగారం తెస్తుండగా.. తన చేతిలో నుంచి బంగారం సంచి కాలువలో పడిపోయిందని సేల్స్ మెన్ తెలిపాడు. దీంతో.. రాత్రంతా జ్యువెలరీ షాప్ సిబ్బంది కాలువలో గాలించారు.

చివరికి బ్యాగ్ దొరికింది. కానీ షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే.. బ్యాగ్ మాత్రమే మిగిలింది. అందులోని గోల్డ్ పోయింది. బ్యాగులోని ఆభరణాలు నీటిలో కొట్టుకుపోయాయని చెబుతున్నారు. కిలోన్నర బంగారం మాయమైందని.. వీఎస్ గోల్డ్ షాప్ యజమాని బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారమంతా.. కాస్త అనుమానంగా ఉండంటంతో.. సేల్స్ మెన్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.