Khairatabad Ganesh: ఖైరతాబాద్‌లో కొలువుదీరిన గణనాథుడు.. తొలిపూజ చేసిన గవర్నర్ తమిళిసై

వినాయక చవితి పర్వదినం సందర్భంగా బుధవారం ఖైరతాబాద్ గణపతి వద్ద కోలాహలం ప్రారంభమైంది. బడా గణేశుడికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తొలిపూజ చేశారు. ఈ ఏడాది పంచముఖ మహాలక్ష్మి గణపతిగా గణనాథుడు దర్శనమిస్తున్నాడు.

Khairatabad Ganesh: ఖైరతాబాద్‌లో కొలువుదీరిన గణనాథుడు.. తొలిపూజ చేసిన గవర్నర్ తమిళిసై

Khairatabad Ganesh

Khairatabad Ganesh: వినాయక చవితి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. వాడవాడలా వినాయకుని మండపాలను ఏర్పాటు చేసి, గణేశ్ విగ్రహాలను ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తొమ్మిదిరోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లోనేకాక దేశవ్యాప్తంగా ఆథ్యాత్మిక వాతావరణం నెలకొననుంది. తెలుగు రాష్ట్రాల్లో ఖైరతాబాద్ గణేశుడికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రతీయేటా ఇక్కడ గణపతి నవరాత్రోత్సవాలను ఘనంగా జరుపుకుంటారు.

Khairatabad Ganesha Statue : ఈ ఏడాది ఖైరతాబాద్ గణేషుడు ప్రత్యేకలు ఇవే .. రెండు అడుగుల దూరం తప్పనిసరి

ఈసారి ఖైరతాబాద్ వద్ద 50 అడుగులతో ఏర్పాటు చేసిన బడా గణేశుడ్ని మొట్టమొదటిసారిగా పూర్తిగా మట్టితోనే తీర్చిదిద్దారు. వినాయకుడితో పాటు షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి, త్రిశక్తిగా పిలుచుకునే మహాగాయత్రి దేవీ కొలువుదీరారు. ఖైరతాబాద్ గణేషుడ్ని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు.

Khairatabad Ganesh Idol Poster : మొదటిసారి మట్టితో ఖైరతాబాద్ వినాయకుడు.. నమూనా ఇదిగో.. ఎత్తు ఎంతో తెలుసా

వినాయక చవితి పర్వదినం సందర్భంగా బుధవారం ఖైరతాబాద్ గణపతి వద్ద కోలాహలం ప్రారంభమైంది. బడా గణేశుడికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తొలిపూజ చేశారు. ఈ ఏడాది పంచముఖ మహాలక్ష్మి గణపతిగా గణనాథుడు దర్శనమిస్తున్నాడు. అనంతరం గవర్నర్ ను కమిటీ సభ్యులు సత్కరించారు. అదేవిధంగా హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మేయర్ తదితర నేతలు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఖైరతాబాద్ గణనాథుడిని దర్శించుకుంటున్నారు. దీంతో ఖైరతాబాద్ గణపయ్య వద్ద సందడి వాతావరణం నెలకొంది.