GHMC కార్మికులకు దీపావళి కానుక..వేతనాలు పెంచిన టి.సర్కార్

  • Published By: madhu ,Published On : November 14, 2020 / 02:07 PM IST
GHMC కార్మికులకు దీపావళి కానుక..వేతనాలు పెంచిన టి.సర్కార్

Govt hikes GHMC Sanitation workers salary : నగరంలో పని చేస్తున్న పారిశుధ్య కార్మికులకు దీపావళి పండుగ రోజు తీపి కబురు అందించింది తెలంగాణ ప్రభుత్వం. వీరికి వేతనాలు పెంచుతున్నట్లు ప్రకటించారు మంత్రి కేటీఆర్. 2020, నవంబర్ 14వ తేదీన మంత్రులతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తీసుకున్న నిర్ణయాలను మంత్రి కేటీఆర్ మీడియాకు వెల్లడించారు.



మార్చిలో కరోనా ప్రారంభమైందని, అప్పటి నుంచి ఇప్పటి వరకు..హైదరాబాద్ నగరంలో హెల్త్ వర్కర్స్, శానిటేషన్ వర్కర్లు చాలా బాగా పని చేశారని కితాబిచ్చారు. మిగతా పట్టణాల కంటే..మెరుగ్గా ఉందని, కరోనా కేసుల సంఖ్య తగ్గిపోతున్నాయన్నారు. శానిటేషన్ వర్కర్ల పట్ల సీఎం కేసీఆర్‌కు అభిమానం, ఎంతో ప్రేమ ఉందని, సీఎం కార్యాలయంలో మీటింగ్ పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు.



గంటల పాటు చర్చించి..సఫాయి అన్నా..నీకు సలాం..అన్నారన్నారు. వారు చేసిన సేవల వల్లే…మహానగరానికి ఓ ఇమేజ్ వచ్చిందని సీఎం కేసీఆర్ చెప్పారన్నారు. 2014లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తమ ప్రభుత్వం వారి విషయంలో ఆలోచించిందన్నారు. సఫాయి కార్మికుల జీతాలు అప్పట్లో



జీహెచ్ఎంసీలో రూ. 8, 500 ఉండేదని, 2015లో వీరి వేతనాన్ని రూ. 12, 500 చేశామన్నారు. మళ్లా… 2017లో సీఎం కేసీఆర్ ఆదేశాల ప్రకారం ప్రభుత్వం వారి జీతాలు పెంచిందని, రూ. 14 వేల 500 చేశామన్నారు. ప్రస్తుతం దీపావళి పండుగ సందర్భంగా వారికి కానుక ఇవ్వాలని నిర్ణయించామన్నారు. నగరంలోని శానిటైషన్ వర్కర్స్ కు రూ. 14 వేల 500 నుంచి మరో రూ. 3 వేలు పెంచుతూ..అంటే…రూ. 17, 500 వేతనం అందిస్తామన్నారు మంత్రి కేటీఆర్.