కోర్టు తీర్పు సంతోషకరం…హాజీపూర్ వరుస హత్యల కేసులో శ్రీనివాస్ రెడ్డి దోషి : సీపీ మహేష్ భగవత్

శ్రీనివాస్ రెడ్డికి పొక్సో కోర్టు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు ఇవ్వడంపై సీపీ మహేష్ భగవత్ హర్షం వ్యక్తం చేశాడు. ముగ్గురు బాలికలను అత్యాచారం, హత్య చేసి పాడుబడిన బావుల్లో పూడ్చిపెట్టారని తెలిపారు.

  • Edited By: veegamteam , February 6, 2020 / 03:24 PM IST
కోర్టు తీర్పు సంతోషకరం…హాజీపూర్ వరుస హత్యల కేసులో శ్రీనివాస్ రెడ్డి దోషి : సీపీ మహేష్ భగవత్

శ్రీనివాస్ రెడ్డికి పొక్సో కోర్టు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు ఇవ్వడంపై సీపీ మహేష్ భగవత్ హర్షం వ్యక్తం చేశాడు. ముగ్గురు బాలికలను అత్యాచారం, హత్య చేసి పాడుబడిన బావుల్లో పూడ్చిపెట్టారని తెలిపారు.

హాజీపూర్ వరుస హత్యల కేసులో పొక్సో ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. వరుస హత్యల కేసులో దోషి శ్రీనివాస్ రెడ్డికి ఉరిశిక్ష విధించింది. ముగ్గురు బాలికలపై అత్యాచారం చేసి, హత్య చేసినట్లు కోర్టు నిర్ధారించింది. ఇద్దరు బాలికల కేసులో ఉరి శిక్ష, మరో బాలిక కేసులో యావజ్జీవ శిక్ష విధిస్తున్నట్లు తీర్పు వెలువరించింది. శ్రీనివాస్ రెడ్డికి ఎటువంటి శిక్ష పడుతుందని చాలా మంది ఉత్కంఠగా ఎదురుచూశారు. అందరూ అనుకున్నట్లుగా శ్రీనివాస్ రెడ్డికి ఉరిశిక్ష విధిస్తూ నల్గొండ పొక్సొ స్పెషల్ కోర్టు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. మూడు కేసుల్లో శ్రీనివాస్ రెడ్డి నేరస్తుడిగా ఉన్నట్లు ప్రాసిక్యూషన్ నిరూపించిందని జడ్జి చెప్పారు. శిక్ష గురించి ఏమైనా చెప్పుకుంటావా అని శ్రీనివాస్ రెడ్డిని జడ్జి అడగ్గా, తనకు ఏమీ తెలియదని..కావాలని తనను ఇరికించారని శ్రీనివాస్ రెడ్డి చెప్పుకొచ్చారు. 

శ్రీనివాస్ రెడ్డికి పొక్సో కోర్టు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు ఇవ్వడంపై సీపీ మహేష్ భగవత్ హర్షం వ్యక్తం చేశాడు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ హాజీపూర్ వరుస హత్యల కేసులో శ్రీనివాస్ రెడ్డి దోషి అని తెలిపారు. ముగ్గురు బాలికలను అత్యాచారం, హత్య చేసి పాడుబడిన బావుల్లో పూడ్చిపెట్టారని తెలిపారు. లిఫ్ట్ ఇస్తానని చెప్పి శ్రీనివాస్ రెడ్డి బాలికలను తీసుకెళ్లేవాడని తెలిపారు. బావి వద్ద స్కూల్ బ్యాగుల ఆధారంగా కేసును విచారించామని చెప్పారు. కర్నూలులోనూ ఓ మహిళను హత్య చేసిన కేసులో శ్రీనివాస్ రెడ్డి దోషి అని తెలిపారు. సాంకేతిక ఆధారాలను సేకరించడంలో పోలీస్ సిబ్బంది సమర్థవంతంగా పని చేసిందని మెచ్చుకున్నారు. సాంకేతిక ఆధారాలు వల్లే ఈ కేసులో శ్రీనివాస్ రెడ్డిని దోషిగా నిరూపించగలిగామని తెలిపారు. కోర్టు తీర్పు సంతోషకరంగా ఉందన్నారు. రూ.14 లక్షల ఖర్చు చేసి గ్రామంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని తెలిపారు. గ్రామంలోని పాడుబడిన బావులను పూడ్చివేయించామని చెప్పారు. గ్రామానికి బస్సు సౌకర్యం కూడా కల్పించామని పేర్కొన్నారు. రెండు కేసుల్లో ఉరి శిక్ష, ఒక కేసులో యావజ్జీవ శిక్ష పడిందన్నారు.

శ్రీనివాస్ రెడ్డి..ముగ్గురు బాలికలపై అత్యాచారం, హత్యలకు సంబధించి వివరాలు, మూడు కేసులపై జరిగిన విచారణ, అతనికి ఊరిశిక్ష పడే వరకు జరిగిన దర్యాప్తును ఆయన వివరించారు. ‘హాజీపూర్ కు చెందిన 11, 17, 14 సంవత్సరాల వయస్సు కలిగిన ముగ్గురు బాలికలను అదే గ్రామానికి చెందిన ముద్దాయి మర్రి శ్రీనివాస్ రెడ్డి..అత్యాచారం చేసి, చంపేసి వారి శవాలను ఊరి పక్కన ఉన్న తెట్టే బావి, మర్రి బావిలో పడేశారు. 2015 సంవత్సరంలో జరిగిన కేసుకు సంబంధించి ఒక అమ్మాయికి లిఫ్ట్ ఇస్తాని చెప్పి…ఆమెను బైక్ ఎక్కించున్నాడు. బావి దగ్గరకు తీసుకెళ్లి లైంగిక వాంఛ తీర్చాలని కోరాడు. అందుకు బాలిక ఒప్పుకోలేదు. ఆమెను హత్య చేసి శవాన్ని గోనె సంచిలో కట్టేసి అక్కడున్న మర్రి బావిలో పడేశాడు. 2019, మార్చి నెలలో మళ్లీ ఒక అమ్మాయికి లిఫ్ట్ ఇస్తానని చెప్పి…బావి దగ్గరకు తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం చేసి, హత్య చేశాడు. శవాన్ని పక్కన ఉన్న తెట్టే బావిలో పడేశారు.
2019, 25 ఏప్రిల్ హాజీపూర్ గ్రామం నుంచి ఒక అమ్మాయి స్కూల్ కు వెళ్లింది. 12 గంటలకు స్కూల్ నుంచి ఇంటికి రావాలి. కానీ ఇంటికి రాలేదు. అయితే ఇంటికి రాలేదని తల్లిదండ్రులు మిస్సింగ్ కేసు పెట్టారు. రెండో రోజు మర్రిబావి దగ్గర అమ్మాయికి సంబంధించిన స్కూల్ బ్యాంగ్ దొరికింది. మరింత గాలింపు చర్యలు చేశాక తెట్టే బావితో బాలిక మృతదేహం కనిపించింది. సైంటిఫిక్ గా విచారణ మొదలు పెట్టాం. 

ముందు నుంచి మర్రి శ్రీనివాస్ రెడ్డి మీద తమకు అనుమానం ఉంది. ఎందుకంటే కర్నూలు టూటౌన్ పోలీస్ స్టేషన్ లో సెక్స్ వర్కర్ అమ్మాయిని అతనితో సహా ముగ్గురు ఎంగేజ్ చేస్తూ డబ్బు విషయంలో అమ్మాయితో గొడవ అయితే అమ్మాయిని చంపేసి, అక్కడున్న వాటర్ ట్యాంక్ లో మృతదేహాన్ని పడేశారు. ఆ కేసులో శ్రీనివాస్ రెడ్డి నిందితుడు కాబట్టి, నేరాలు చేసిన చరిత్ర ఉంది. కొన్ని నేరాలు అయిన తర్వాత ఊరి నుంచి పరాయినట్టు తెలిసింది. 30 ఏప్రిల్ రోజు శ్రీనివాస్ రెడ్డిని రావిరాల ఊరి దగ్గర అరెస్టు చేశాం..మూడు కూడా సంచలనాల కేసుల కింద పొక్సో వ్యాగ్, రేప్, మర్డర్, స్క్రీనింగ్ కింద విచారణ చేశాము’ అని తెలిపారు.

‘తమకు సహకరించిన ఆర్డీవో, ఎమ్మార్వో, ఫొరెన్సిక్ సైన్స్ ల్యాబ్, ఫింగర్ ప్రింట్ బ్యూరో, ఎస్ వోటీ టీమ్, సెల్ పోన్ కు సంబంధించి సర్వీస్ ప్రొవైడర్స్, అమ్మాయిలు మైనర్ అని సర్టిఫికేట్స్ ఇచ్చిన స్కూల్స్ కు, హాజీపూర్ గ్రామస్తులు మంచిగా సహకరించారు. తమపై ఉన్న నమ్మకంతో గ్రామస్తులు చాలా మంచిగా సహకరించారు. టైమ్ టు టైమ్ కేసును హైలెట్ చేస్తూ త్వరగా కేసు పడాలి, తొందరగా తీర్పు రావాలని సహకారం చేశారు. తమకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. 

ఏప్రిల్ 25 మొదటి కేసు నమోదు అయింది. ఫిబ్రవరి 6, 2020 తీర్పు వచ్చింది. ఎనిమిది నెలల్లో అన్ని కేసులకు ట్రయల్ పూర్తి అయి తీర్పు రావడం మొదటిసారి. హైకోర్టు, సుప్రీంకోర్టులో శిక్ష కన్ ఫామ్ కావాలని..దాని కోసం ప్రయత్నం చేస్తామని చెప్పారు. బాధిత సహాయ నిధి కింద బాధిత కుటుంబాలకు జిల్లా కలెక్టర్ ద్వారా కచ్చితంగా నష్టపరిహారం ఇప్పిస్తాం’ అని సీపీ చెప్పారు.