Doctors Remove 200 Fly Eggs From Woman’s Nose : మహిళ ముక్కులో 200 గుడ్లు పెట్టిన ఈగ..ఆపరేషన్‌ చేసి తొలగించిన హైదరాబాద్‌ ENT వైద్యులు

ఓ మహిళ ముక్కులోకి ఈగ వెళ్లింది. ఏకంగా 200 గుడ్లు పెట్టింది. ENT వైద్యులు ఆమె ముక్కు లోపల ఉన్న ఈగ లార్వాలను తొలగించేందుకు సర్జరీ నిర్వహించారు. మహిళకు డయాబెటిక్ లెవెల్స్ విపరీతంగా పెరగడంతో.. వీటన్నింటినీ కంట్రోల్ చేసి తన ఆరోగ్య పరిస్థితి స్టేబుల్ అయిన తర్వాత ENT వైద్యుల సహకారంతో ఈగ లార్వాలను తొలగించారు.

Doctors Remove 200 Fly Eggs From Woman’s Nose : మహిళ ముక్కులో 200 గుడ్లు పెట్టిన ఈగ..ఆపరేషన్‌ చేసి తొలగించిన హైదరాబాద్‌ ENT వైద్యులు

fly eggs removed from woman's nose

Doctors Remove 200 Fly Eggs From Woman’s Nose : మనకు ముక్కులోకి చిన్న దోమ వెళ్తేనే.. నానా ఇబ్బంది పడతాం.. తుమ్ములతో అల్లాడిపోతాం. అలాంటిది అక్కడ ఓ మహిళ ముక్కులోకి ఈగ వెళ్లింది. ఏకంగా 200 గుడ్లు పెట్టింది. దీంతో ఆ మహిళ నరకయాతన అనుభవించింది. ఇది ఎక్కడో కాదు ఆంధ్రప్రదేశ్‌లోనే జరిగింది. గుంటూరు జిల్లాకు చెందిన 50 ఏళ్ల మహిళ ఆరు నెలల క్రితం కరోనా బారిన పడ్డారు. తర్వాత ఆమెకు బ్లాక్ ఫంగస్ కూడా సోకింది. ఈ ఇన్ఫెక్షన్ మెదడుకు వ్యాపించడంతో ఆమె కుడి కన్నును కూడా తొలగించాల్సి వచ్చింది.

ఎడమ కంటి చూపు నెమ్మదిగా మందగించడం మొదలైంది. అయితే అప్పటికే డయాబెటిస్‌తో బాధపడుతున్న ఆమెకు కిడ్నీలు కూడా సరిగ్గా పనిచేయటం లేదు. ఆమె పరిస్థితి చాలా ఆందోళనకరంగా మారడంతో ఈనెల 2న బంజారాహిల్స్‌లోని సెంచరీ హాస్పిటల్‌కి ఆమె కుటుంబ సభ్యులు తీసుకొచ్చారు. ఇక్కడి వైద్యులు పేషంట్‌ని పరిశీలించిన తర్వాత అన్ని పరీక్షలు నిర్వహించాక షాకింగ్‌కి గురిచేసే విధంగా ఆమె ముక్కులో ఈగ గుడ్లు పెట్టినట్టుగా గుర్తించారు. ఏకంగా 200 గుడ్ల వరకు ఉన్నట్టుగా గుర్తించారు.

Infant 3 Legs : మూడు కాళ్లతో శిశువు జననం… అరుదైన శస్త్రచికిత్సతో తొలగింపు..

అప్పటికే ఆమెకు అనేక ఆరోగ్య సమస్యలు ఉండటంతో జనరల్ ఫిజీషియన్, నెఫ్రాలజీ డాక్టర్ల బృందం ముందుగా ఆమె ఆరోగ్య పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రయత్నించారు. ఆ తరువాత ENT వైద్యులు ఆమె ముక్కు లోపల ఉన్న ఈగ లార్వాలను తొలగించేందుకు సర్జరీ నిర్వహించారు. అయితే ఈగ లార్వాలు మెదడు వరకు చేరుకోవటంతో మెదడుకి కూడా ఇన్ఫెక్షన్ సోకినట్లు గుర్తించారు. దీంతో ఆమె కుడికన్ను తొలగించాల్సి వచ్చిందని… మరోవైపు ఎడమ కన్ను కంటి చూపుపై కూడా ప్రభావం పడ్డట్టు వైద్యులు గుర్తించారు.

మహిళకు డయాబెటిక్ లెవెల్స్ విపరీతంగా పెరగడంతో.. వీటన్నింటినీ కంట్రోల్ చేసి తన ఆరోగ్య పరిస్థితి స్టేబుల్ అయిన తర్వాత ENT వైద్యుల సహకారంతో ఈగ లార్వాలను తొలగించారు. అయితే ఇన్ని కాంప్లికేషన్స్ ఉన్న పేషంట్‌కి విజయవంతంగా శస్త్రచికిత్స చేయడం ఆనందం కలిగించిందని.. పేషంట్ ముక్కులో నుంచి దాదాపుగా 200 ఈగ లార్వాలను బయటికి తీస్తున్నప్పుడు ఆశ్చర్యం వేసిందని డాక్టర్లు చెప్పారు. ఇప్పుడు ఆ మహిళ ఎంతో ఆరోగ్యంగా నడుచుకుంటూ వెళ్లిందని వైద్యులు తెలిపారు.