Hyderabad Airport Metro : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వరకు మెట్రో నిర్మాణం దిశగా తొలి అడుగు.. మట్టి పరీక్షలు షురూ

Hyderabad Airport Metro : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వరకు మెట్రో నిర్మాణం దిశగా తొలి అడుగు.. మట్టి పరీక్షలు షురూ

Hyderabad Airport Metro : హైదరాబాద్ లో మెట్రో విస్తరణ పనుల కొనసాగుతున్నాయి. రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు విస్తరించనున్న పనులు.. ఒక్కో అడుగు ముందుకు పడుతున్నాయి. మొత్తం 31 కిలోమీటర్ల మార్గంలో 100 చోట్ల మట్టి పరీక్షలు నిర్వహించేందుకు హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రో లిమిటెడ్ ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది.

ఇందులో భాగంగా రాయదుర్గం-మైండ్ స్పేస్ జంక్షన్ సమీపంలోని ఐకియా స్టోర్ ముందు భూసార పరీక్షలు చేపట్టారు. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు వరకు వంద మెట్రో పిల్లర్ల స్థానాల్లో సుమారు రెండు నెలల పాటు భూసార పరీక్షల పనులు చేపట్టనున్నట్లు మెట్రో వర్గాలు వెల్లడించాయి. శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు నిర్మించనున్న మెట్రో కారిడార్ కోసం గ్లోబల్ టెండర్స్ ఆహ్వానించిన మెట్రో.. ఇప్పటికే విదేశాలకు చెందిన 5 జనరల్ కన్సల్టెంట్లను క్వాలిఫై చేసింది.(Hyderabad Airport Metro)

Also Read..Hyderabad Traffic Restrictions : హైదరాబాద్ ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ దగ్గర మూడు నెలలు ట్రాఫిక్ ఆంక్షలు

పిల్లర్స్ ఫౌండేషన్లను ఫైనల్ చేసిన అధికారులు ఆయా ప్రాంతాల్లో భూసామర్థ్య పరీక్షలు ప్రారంభించారు. దాంతో నిర్మాణ సంస్థకు పునాదులు ఏ మేరకు తవ్వవచ్చు? ఓపెన్ ఫౌండేషన్ వేయాలా? లేదా ఫైల్ ఫౌండేషన్ వేయాలా? అనే అంశాలపై స్పష్టత వస్తుందని మెట్రో వర్గాలు అంటున్నాయి. మెట్రో స్థంభాల నిర్మాణం ప్రతిపాదించిన ప్రతీ చోట భూమి ఉపరితలం నుంచి సుమారు 40అడుగుల లోతు వరకు తవ్వనున్నారు. అక్కడికక్కడే పరీక్షలు చేసేలా.. మట్టి నమూనా పరీక్షలు చేయడం ద్వారా భూసామర్థ్యాన్ని నిర్ణయించడానికి వీలుంటుంది.

ఈ పరీక్షలు నిర్వహించడం వల్ల పిల్లర్స్ పునాదులు ఏ మేరకు తవ్వాలి? ఓపెన్ ఫౌండేషన్ లేదా ఫైల్ ఫౌండేషన్ వెయ్యాలా? అనే అంశాన్ని నిర్ణయించడం జరుగుతుందని అంటున్నాయి మెట్రో వర్గాలు. ఈ పరీక్షలతో టెండర్ ప్రక్రియలో పాల్గొనే బిల్డర్లకు కూడా ఈ ప్రాజెక్ట్ నిర్మాణం జరిగే భూమి తీరుపై ఒక అవగాహన కలుగుతుంది. అలాగే వారు టెండర్లలో పాల్గొనే సమయంలో తగిన ఆర్థిక అంచనాలు రూపొందించుకోవటంలో కూడా ఈ పరీక్షలు ఎంతగానో ఉపయోగపడతాయి.

Also Read..Minister KTR : కేంద్రం సహకరించకపోయినా.. హైదరాబాద్ లో 250 కి.మీ మెట్రోను తీసుకొస్తాం : మంత్రి కేటీఆర్

హైదరాబాద్ మెట్రో ఫేజ్-2లో భాగంగా రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు మెట్రోని విస్తరించాలని నిర్ణయించారు. 31 కిలోమీటర్లు గల ఈ కారిడార్ నిర్మాణం కోసం హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లిమిటెడ్ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. రూ.6వేల 250 కోట్ల అంచనా వ్యయంతో మూడేళ్లలో ఈ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు అధికారులు. ఎయిర్ పోర్ట్ మెట్రో కారిడార్ కోసం 2022 డిసెంబర్ 9న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. నగర వ్యాప్తంగా ప్రస్తుతం రోజుకు 4లక్షల మంది మెట్రోలో ప్రయాణిస్తున్నారు.

Also Read..Delhi Metro: ఢిల్లీ మెట్రో రైలు మరింత వేగం.. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనున్న రైళ్లు

ఎయిర్ పోర్ట్ మెట్రో కారిడార్ 31 కిలోమీటర్ల కారిడార్ అందుబాటులోకి వస్తే ఎయిర్ పోర్ట్ రద్దీ కూడా మెట్రోకి పెరుగుతుంది. 27.5 కిలోమీటర్ల ఎలివేటేడ్ కారిడార్ తో పాటు 2.5 కిలోమీటర్ల అండర్ గ్రౌండ్ మెట్రో కూడా ఉండటం విశేషం. ఎయిర్ పోర్టు మెట్రో ద్వారా ప్రయాణికులు వేగంగా, క్షేమంగా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు చేరుకునే అవకాశం కలుగుతుంది.