Minister KTR : కేంద్రం సహకరించకపోయినా.. హైదరాబాద్ లో 250 కి.మీ మెట్రోను తీసుకొస్తాం : మంత్రి కేటీఆర్

కేంద్రం సహకరించినా, సహకరించకపోయినా హైదరాబాద్ నగరంలో 250 కిలోమీటర్ల మెట్రో రైలు మార్గాన్ని తీసుకు వస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. మెట్రోరైలును పొడిగిస్తున్నామని ఖాజాగూడ చెరువు పక్కనుండే ఎయిర్ పోర్టుకు వెళుతుందని తెలిపారు.

Minister KTR : కేంద్రం సహకరించకపోయినా.. హైదరాబాద్ లో 250 కి.మీ మెట్రోను తీసుకొస్తాం : మంత్రి కేటీఆర్

Minister KTR

Minister KTR : కేంద్రం సహకరించినా, సహకరించకపోయినా హైదరాబాద్ నగరంలో 250 కిలోమీటర్ల మెట్రో రైలు మార్గాన్ని తీసుకు వస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. మెట్రోరైలును పొడిగిస్తున్నామని ఖాజాగూడ చెరువు పక్కనుండే ఎయిర్ పోర్టుకు వెళుతుందని తెలిపారు. మూడు ఏళ్లలో 31 కిలోమీటర్ల మెట్రో అందుబాటులోకి వస్తుందన్నారు. హైదరాబాద్ నగరంలో రాబోయే కొద్ది రోజుల్లో ప్రపంచంలో 50% వ్యాక్సిన్లు ఉత్పత్తి అవుతాయని తెలిపారు. భారీగా పెట్టుబడులు హైదరాబాద్ నగరానికి వస్తున్నాయని దాంతో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కల్పించబడుతున్నాయని చెప్పారు. మెడికల్ మాత్రమే కాకుండా ఐటీ రంగంలో కూడా హైదరాబాద్ విపరీతంగా అభివృద్ధి చెందుతుందన్నారు.

రాబోయే రోజుల్లో చాలా ఎక్కువగా పెట్టుబడులు హైదరాబాద్ కు వస్తాయని చెప్పారు. ఇప్పుడు హైదరాబాదులో జరుగుతున్నది ప్రారంభం మాత్రమేనని.. భవిష్యత్తులో చాలా వేగవంగా అభివృద్ధి జరుగుతుందన్నారు. మెట్రోను పొడిగిస్తున్నామని ఖాజాగూడ చెరువు పక్కనుండే ఎయిర్ పోర్టుకు వెళుతుందన్నారు. మూడు ఏళ్లలో 31 కిలోమీటర్ల మెట్రో అందుబాటులోకి వస్తుందన్నారు. గచ్చిబౌలి మాదాపూర్ లో పని చేసే వాళ్లు శంషాబాద్ వరకు ఉండవచ్చన్నారు. నాగోల్ నుండి ఎల్బీనగర్, గచ్చిబౌలి నుండి లక్డికాపూల్ వరకు తాము మెట్రో చేపడతామని కేంద్రానికి లెటర్ రాస్తే అది ఫీజబుల్ కాదని కేంద్ర ప్రభుత్వం అంటుందన్నారు.

Minister KTR : నీ ప్రధాని మోదీ.. ఒక బ్రోకర్ అని నేను అనలేనా? బండి సంజయ్‌పై కేటీఆర్ ఫైర్

ఈ రోజే కేంద్రం నుండి సమాచారం వచ్చిందని.. ఇది చాలా బాధించదగ్గ విషయమన్నారు. ఇతర రాష్ట్రాల్లో మాత్రం ఇస్తున్నారు ఇక్కడ మాత్రం ప్రయాణికులు లేరు అంటూ కేంద్రం చెప్పడం సరైంది కాదని తెలిపారు. హైదరాబాద్ నగరం కంటే చాలా చిన్న నగరాలకు డబ్బులు ఇచ్చి ఇక్కడ మాత్రం ఫీజుబులిటీ కాదు అనడం అసలు సరైనది కాదన్నారు. హైదరాబాద్ అభివృద్ధి అయితే దేశం అభివృద్ధి చెందినట్లు కాదా హైదరాబాదు నుండి పన్నులు దేశానికి వెళ్లడం లేదా? అని ప్రశ్నించారు. తెలంగాణ నుండి కేంద్రానికి రూ.3.68 లక్షల కోట్లు వెళ్తే.. తెలంగాణకు మాత్రం రూ.1,68 వేల కోట్లు మాత్రమే వచ్చాయని వెల్లడించారు.

తెలంగాణ, హైదరాబాద్ నగర అభివృద్ధికి కేంద్రం మద్దతు ఇవ్వాలని తాను చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. కేంద్రం సహకరించినా, సహకరించకపోయినా హైదరాబాద్ నగరంలో 250 కిలోమీటర్ల మెట్రోను తీసుకువస్తామని చెప్పారు. హైదరాబాద్ నగరంలో 5 ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెడతామని, భవిష్యత్తులో అన్ని బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా చేస్తామని చెప్పారు. మూసిపై యాభై ఐదు కిలోమీటర్ల మేర ఈస్ట్ వెస్ట్ కారిడార్ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.

LB Nagar RHS Flyover : ఇక ఉండదు ట్రా”ఫికర్”.. ఎల్బీనగర్ ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

సామాజిక బాధ్యతలో భాగంగా చెరువుల అభివృద్ధి చేపట్టిన వాళ్ళు తప్పనిసరిగా మంచిగా చేయాలని సూచించారు. అన్ని చెరువుల వివరాలు ఇప్పుడే బయట పెడతామని చెప్పారు. చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్, చక్కటి ప్లాంటేషన్, ఓపెన్ జిమ్లు, యోగా చేసేందుకు అవకాశం ప్రశాంతంగా కూర్చునేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. పిల్లల కోసం ప్లే ఏరియా పాంట్స్ వద్ద టీం పార్క్స్, సెక్యూరిటీ రూమ్ అవసరం ఉంటే హ్యాపీ థియేటర్ ను ఏర్పాటు చేయాలన్నారు. జీహెచ్ఎంసీ హెచ్ఎండీఏ టీఎస్ ఐఐసీతోపాటు ఇతర విభాగాలు సహకారం అందిస్తాయని తెలిపారు.