Delhi Metro: ఢిల్లీ మెట్రో రైలు మరింత వేగం.. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనున్న రైళ్లు

‘ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ లైన్’ మార్గం పొడవు 23 కిలోమీటర్లు కాగా, మొత్తం 21 స్టేషన్లు ఉంటాయి. ఇది న్యూఢిల్లీని, ద్వారకా సెక్టార్‌ను కలుపుతుంది. మెట్రో రైలు గరిష్ట వేగం పెంచేందుకు ‘మెట్రో రైల్ సేఫ్టీ కమిషన్’ ఆమోదం తెలిపింది. దీంతో రైలు వేగాన్ని పెంచుతూ సంస్థ నిర్ణయం తీసుకుంది.

Delhi Metro: ఢిల్లీ మెట్రో రైలు మరింత వేగం.. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనున్న రైళ్లు

Delhi Metro: ఢిల్లీలో మెట్రో రైళ్లు అత్యధిక వేగంతో ప్రయాణించబోతున్నాయి. ‘ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ లైన్’ మార్గంలో ప్రయాణించే మెట్రో రైళ్లు ఇకపై గంటకు వంద కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ఇప్పటికే ఈ రైళ్లు గంటకు 90 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నాయి. తాజాగా ఈ వేగాన్ని మరింతగా పెంచేందుకు నిర్ణయం తీసుకున్నారు.

London: లండన్‌లో భారత రాయబార కార్యాలయంపై భారీ మూడు రంగుల జెండా.. వీడియో వైరల్

దీనిద్వారా ప్రారంభ స్టేషన్ నుంచి ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు 21 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. ‘ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ లైన్’ మార్గం పొడవు 23 కిలోమీటర్లు కాగా, మొత్తం 21 స్టేషన్లు ఉంటాయి. ఇది న్యూఢిల్లీని, ద్వారకా సెక్టార్‌ను కలుపుతుంది. మెట్రో రైలు గరిష్ట వేగం పెంచేందుకు ‘మెట్రో రైల్ సేఫ్టీ కమిషన్’ ఆమోదం తెలిపింది. దీంతో రైలు వేగాన్ని పెంచుతూ సంస్థ నిర్ణయం తీసుకుంది. నెల రోజులపాటు ప్రయోగాత్మకంగా గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అమలు చేస్తారు. ఇది సత్ఫలితాలను ఇస్తే ఈ వేగాన్ని 110 కిలోమీటర్లకు పెంచుతారు. కాగా, ఈ వేగం ‘ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ లైన్’ మార్గంలో ప్రయాణించే రైళ్లకు మాత్రమే వర్తిస్తుంది.

Jharkhand: నాలుగు రోజుల శిశువును తొక్కి చంపిన పోలీసులు.. విచారణకు ఆదేశించిన సీఎం

యెల్లో లైన్, బ్లూ లైన్, రెడ్ లైన్, ఇతర మార్గాల్లో ప్రయాణించే మెట్రో రైళ్ల గరిష్ట వేగం మాత్రం గంటకు 40-50 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. మొత్తంగా మెట్రో రైలు వేగాన్ని గంటకు 120 కిలోమీటర్లకు పెంచాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ప్రతినిధి అనూజ్ దయాళ్ తెలిపారు. రైళ్ల వేగాన్ని గంటకు వంద కిలోమీటర్లకు పెంచేందుకు తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు, ఎన్నో అంశాల్ని పరిశీలించినట్లు ఆయన చెప్పారు.