HCU Rape Case : హెచ్‌సీయూలో విద్యార్థినిపై అత్యాచారయత్నం కేసు.. కీచక ప్రొఫెసర్‌కు 14 రోజుల రిమాండ్

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కీచక ప్రొఫెసర్ రవి రంజన్ కు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. దీంతో ఆయనను సంగారెడ్డి జైలుకి తరలించారు పోలీసులు. విద్యార్థినిపై అత్యాచారయత్నం కేసులో ప్రొఫెసర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

HCU Rape Case : హెచ్‌సీయూలో విద్యార్థినిపై అత్యాచారయత్నం కేసు.. కీచక ప్రొఫెసర్‌కు 14 రోజుల రిమాండ్

HCU Rape Case : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కీచక ప్రొఫెసర్ రవి రంజన్ కు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. దీంతో ఆయనను 14 రోజుల రిమాండ్ కోసం సంగారెడ్డి జైలుకి తరలించారు. గతంలో కూడా కొంతమంది విద్యార్థినులపై ప్రొఫెసర్ రవి రంజన్ అసభ్యంగా ప్రవర్తించినట్లు పోలీసుల విచారణలో గుర్తించారు. అయితే, వారెవరూ ఫిర్యాదు చేయకపోవడంతో కీచక ప్రొఫెసర్ లీలలు వెలుగులోకి రాలేదు. తాజాగా విద్యార్థినిపై అత్యాచారయత్నం కేసు హెచ్ సీయూలో సంచలనం రేపింది. దీంతో ఇప్పటికే రవి రంజన్ ను హెచ్ సీయూ సస్పెండ్ చేసింది.

Also Read..HCU Prof Ravi Ranjan Suspend: థాయ్‌లాండ్ విద్యార్థినిపై అత్యాచార యత్నం .. HCU ప్రొఫెసర్ రవిరంజన్ సస్పెండ్

బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడు రవి రంజన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. తనకు హిందీ నేర్పిస్తామని చెప్పి ప్రొఫెసర్ రవిర రంజన్ లైంగిక దాడికి పాల్పడినట్లు బాధిత విద్యార్థిని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

1993 నుండి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో ప్రొఫెసర్ రవిరంజన్ పని చేస్తున్నాడు. ఈ నెల 1న రాత్రి బాధితురాలిని ప్రొఫెసర్ తన ఇంటికి పిలిచాడు. ఆ సమయంలో డ్రింక్ లో మత్తుమందు కలిపి విద్యార్థినికి ఇచ్చాడు. అయితే ఈ డ్రింక్ ను ఆ యువతి పూర్తిగా తాగలేదు. దీంతో మత్తులోకి జారుకోలేదు. అదే సమయంలో యువతిపై నిందితుడు లైంగిక దాడికి యత్నించాడు. ఇది గమనించిన యువతి కేకలు వేసింది.

Also Read..Maharashtra: బాలికపై పదిహేనేళ్ల బాలుడి హత్యాచారం.. బాలిక తండ్రిపై ప్రతీకారం తీర్చుకునేందుకు దారుణం

ఈ ఘటనపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్లు 354ఎ, 328 సెక్షన్ల కింద కేసు నమోదైంది. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. గతంలోనూ ప్రొఫెసర్ రవిరంజన్ విద్యార్ధినులపై ఇదే తరహలోనే లైంగిక దాడికి పాల్పడినట్టుగా గుర్తించారు. అయితే అప్పుడు ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో ప్రొఫెసర్ రవిరంజన్ బాగోతం బయటపడలేదు. చివరికి అతడి పాపం పండింది.

విదేశీ విద్యార్థిని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)లో హిందీ డిపార్ట్ మెంట్ లో స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ చదువుతోంది. అదే డిపార్ట్ మెంట్ కు చెందిన ప్రొఫెసర్ రవి రంజన్ హిందీ ఫ్యాకల్టీగా పని చేస్తున్నాడు. ప్రొఫెసర్ రవి విదేశీ విద్యార్థినిపై ఎప్పటి నుంచో కన్నేశాడు. అవకాశం కోసం ఎదురు చూస్తునాడు. హిందీ భాష నేర్పిస్తానని చెప్పి అత్యాచారం చేయబోయాడు. అయితే విద్యార్థిని తృటిలో తప్పించుకొని పారిపోయింది. ఈ ఘటనతో విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు ఉలిక్కిపడ్డారు. పిల్లలకు విద్యాబుద్ధులు, సంస్కారం నేర్పాల్సిన గురువులే.. కామంతో కళ్లు మూసుకుపోయి ఇలాంటి పాడు పనులకు పాల్పడుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది.