Food Delivery Boys : హైదరాబాద్‌లో ఫుడ్ డెలివరీ బాయ్స్‌కు ఊహించని షాక్.. వాహనాలు సీజ్

హైదరాబాద్ లో లాక్ డౌన్ నిబంధనలను పోలీసులు మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. లాక్ డౌన్ ప్రారంభం నుంచి ఫుడ్ డెలివరీ, ఈ కామర్స్ సేవలను అనుమతించిన పోలీసులు.. సడెన్ గా.. వాటికి కూడా అనుమతి ఇవ్వడం లేదు. ఉదయం 10 గంటల తర్వాట రోడ్లపై తిరుగుతున్న ఫుడ్ డెలివ‌రీ బాయ్స్‌ను పోలీసులు అడ్డుకున్నారు. స్విగ్గీ, జొమాటో ఫుడ్ డెలివరీ బాయ్స్ వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. పోలీసుల తీరుతో ఫుడ్ డెలివరీ బాయ్స్ కంగుతిన్నారు. తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

Food Delivery Boys : హైదరాబాద్‌లో ఫుడ్ డెలివరీ బాయ్స్‌కు ఊహించని షాక్.. వాహనాలు సీజ్

Food Delivery Boys

Cops Seized Food Delivery Boys Vehicles : హైదరాబాద్ లో లాక్ డౌన్ నిబంధనలను పోలీసులు మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. లాక్ డౌన్ ప్రారంభం నుంచి ఫుడ్ డెలివరీ, ఈ కామర్స్ సేవలను అనుమతించిన పోలీసులు.. సడెన్ గా.. వాటికి కూడా అనుమతి ఇవ్వడం లేదు. ఉదయం 10 గంటల తర్వాట రోడ్లపై తిరుగుతున్న ఫుడ్ డెలివ‌రీ బాయ్స్‌ను పోలీసులు అడ్డుకున్నారు. స్విగ్గీ, జొమాటో ఫుడ్ డెలివరీ బాయ్స్ వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. పోలీసుల తీరుతో ఫుడ్ డెలివరీ బాయ్స్ కంగుతిన్నారు. తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

త‌నిఖీలో భాగంగా సికింద్రాబాద్‌, ఖైర‌తాబాద్ దగ్గర పోలీసులు ఫుడ్ డెలివ‌రీ బాయ్స్‌ను నిలిపేశారు. ఫుడ్ డెలివ‌రీ చేయ‌డానికి అనుమ‌తి నిరాక‌రించారు. స్విగ్గీ, జొమాటో బాయ్స్‌ను ఆపేసి వారు వాహనాలు సీజ్ చేయడంతో.. వారు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

నిన్న‌టి వ‌ర‌కూ అనుమ‌తిచ్చి ఇలా ఉన్న‌ఫ‌ళంగా అనుమ‌తించ‌క‌పోవ‌డం ఏంటని వాపోయారు. ముందస్తు సమాచారం లేకుండా అడ్డుకోవడాన్ని తప్పుపట్టారు. టైమ్ లో ఫుడ్ డెలివరీ చేయలేకపోయినందుకు స్విగ్గీ, జొమాటో తమకు పెనాల్టీ వేస్తాయని, పోలీసులు కూడా తమకు జరిమానాలు విధిస్తున్నారని.. ఇలా రెండు విధాలుగా నష్టపోతున్నామని వాపోయారు. కరోనా కాలంలో ఇంట్లో ఆహారం తయారు చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్న వారికి ఇలా తమ సేవలు అందిస్తున్నామని, పోలీసులు అడ్డుకుంటే అలాంటి వారంతా తీవ్ర ఇబ్బందులు పడతారని డెలివరీ బాయ్స్ అంటున్నారు.

కాగా, నిన్న‌టి వ‌ర‌కు ఫుడ్ డెలివరీకి అనుమ‌తి ఇచ్చిన పోలీసులు క‌ఠిన నిబంధ‌న‌ల నేప‌థ్యంలో ఈ చర్య‌లు తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఫుడ్ డెలివరీ సర్వీసులకే కాదు ఈ కామర్స్ సేవలకూ అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు.