SCCL Jobs : నిరుద్యోగులకు శుభవార్త.. సింగరేణిలో ఉద్యోగాలు, రాత పరీక్ష లేదు
తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త. ప్రభుత్వరంగ సంస్థ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
SCCL Jobs : తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త. ప్రభుత్వరంగ సంస్థ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ ట్రేడ్ లలో ఖాళీగా ఉన్న 1,146 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 28 దరఖాస్తులకు చివ రితేది. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://scclmines.com/వెబ్సైట్ చూడొచ్చు.
మొత్తం ఖాళీలు: 1146
కాల పరిమితి: ఏడాది
ట్రేడులు: ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్, మెకానిక్ మోటార్ వెహికల్, డ్రాఫ్ట్స్మెన్ (సివిల్), డీజిల్ మెకానిక్, వెల్డర్ ట్రేడుల్లో ఈ ఖాళీలున్నాయి.
విద్యార్హత: అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. ఇంటర్ ఒకేషనల్ విద్యార్థులు అనర్హులు.
వయసు: అభ్యర్థుల వయసు 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.
స్టైపెండ్: రెండేళ్ల ఐటీఐ అభ్యర్థులకు నెలకి రూ.8,050.. ఏడాది ఐటీఐ అభ్యర్థులకు నెలకు రూ.7700 చెల్లిస్తారు.
ఎంపిక: ఐటీఐ ఉత్తీర్ణతలో సీనియారిటీ ప్రాతిపదికన ఎంపిక. ఒకవేళ చాలా మంది అభ్యర్థుల ఉత్తీర్ణత సంవత్సరం ఒకటే ఏడాది అయి ఉంటే.. వారు ఐటీఐలో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్.. అభ్యర్థులు తొలుత https://apprenticeshipindia.org/ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాలి. అనంతరం సింగరేణి వెబ్సైట్ https://scclmines.com/apprenticeship/ లో జూన్ 28వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాలి. దీనికి సంబంధించిన జిరాక్స్ కాపీలను సమీప వీటీసీల్లో జూన్ 29వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు సమర్పించాలి.
జత చేయాల్సిన ధ్రువపత్రాలు: 10వ తరగతి/తత్సమాన విద్యార్హత సర్టిఫికెట్, అభ్యర్థి సంతకంతో కూడిన రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, ఐటీఐ సర్టిఫికెట్ (సర్టిఫికెట్/ఎన్సీవీటీ/ఎస్సీవీటీ), క్యాస్ట్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు జతచేయాలి.
దరఖాస్తులకు చివరితేది: జూన్ 28, 2021
వెబ్సైట్: https://scclmines.com/