Undavalli Arun Kumar : బీజేపీ వ్యతిరేక శక్తులకు నాయకత్వం వహించే శక్తి కేసీఆర్ కు ఉంది : ఉండవల్లి

బీజేపీ విధానాలు దేశానికి నష్టం కలిగిస్తాయని చెప్పారు. బీజేపీకి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడలేని పరిస్థితులు తెచ్చారని వాపోయారు. ఎవరైనా మాట్లాడితే దర్యాప్తు సంస్థలను పంపుతున్నారని పేర్కొన్నారు.

Undavalli Arun Kumar : బీజేపీ వ్యతిరేక శక్తులకు నాయకత్వం వహించే శక్తి కేసీఆర్ కు ఉంది : ఉండవల్లి

Vundavalli Arun Kumar

Undavalli Arun Kumar : కేసీఆర్ కు జాతీయ రాజకీయాలపై క్లారిటీ ఉందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. కేసీఆర్ స్పష్టమైన ఎజెండా ఉందని చెప్పారు. ఫ్రంట్ అంటే నమ్మకం రాదు.. పార్టీ అంటేనే నమ్మకం వస్తుందని చెప్పారు. అందుకే కేసీఆర్ జాతీయ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. నిన్న కేసీఆర్ తో భేటీ అయిన ఉండవల్లి..జాతీయ రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఇవాళ ఉండవల్లి అరుణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ బీజేపీ వ్యతిరేక శక్తులకు నాయకత్వం వహించే శక్తి కేసీఆర్ కు ఉందన్నారు. దేశానికి సబంధించిన అన్ని విషయాలపై కేసీఆర్ కు అవగాహన ఉందని చెప్పారు. కేసీఆర్ కు తనకన్నా ఎక్కువ తెలుసని చెప్పారు. జగన్, చంద్రబాబు, పవన్ ఎవరికి సపోర్టు చేస్తున్నారో కేసీఆర్ కు తెలుసన్నారు.

బీజేపీ విధానాలు దేశానికి నష్టం కలిగిస్తాయని చెప్పారు. బీజేపీకి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడలేని పరిస్థితులు తెచ్చారని వాపోయారు. ఎవరైనా మాట్లాడితే దర్యాప్తు సంస్థలను పంపుతున్నారని పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న కేసీఆర్ కు బీజేపీ వ్యతిరేకులంతా మద్దతివ్వాల్సిన అవసరం ఉందన్నారు. సౌదీ తప్ప.. ప్రపంచంలో హిందూ గుడి లేనటువంటి ప్రదేశమే లేదన్నారు. అన్ని చోట్ల విగ్రహాలు పెట్టుకొని మనవాళ్లు పూజలు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రపంచ దేశాలకు భారత్ సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. రాజు ఎలా పరిపాలిస్తారో అలానే మోదీ పాలిస్తున్నారని విమర్శించారు.

Undavalli on Modi: కాంగ్రెస్, బీజేపీ కలిసే ఏపీకి అన్యాయం చేశాయి: మోదీ ‘విభజన’ కామెంట్లపై ఉండవల్లి ఫైర్!

ఏపీలో ఏ పార్టీ గెలిచినా బీజేపీ వెంటే ఉంటాయని తెలిపారు. ఏపీలో బీజేపీని వ్యతిరేకించే పార్టీలు లేవన్నారు. రాజకీయాల్లో కొనసాగాలనే ఆసక్తి.. శక్తి తనకు లేదన్నారు. ఏ పోస్టు తీసుకోవడానికి సిద్ధంగా లేనని గతంలోనే చెప్పానని తెలిపారు. సీఎం కేసీఆర్ ఆహ్వానం మేరకు ఆయనను కలిశానని తెలిపారు. 10 రోజుల క్రితం కేసీఆర్ ఫోన్ చేసి కలవగలరా అని అడిగారు.. నిన్న లంచ్ కు వెళ్లానని చెప్పారు. సీఎం అయ్యాక కేసీఆర్ ను కలవడం ఇదే మొదటిసారి అన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా తనను వాయిస్ మరింత పెంచమన్నారు..3 గంటల భేటీలో ప్రశాంత్ కిశోర్ కూడా ఉన్నారని పేర్కొన్నారు. మళ్లీ కలవాలని కేసీఆర్ అడిగారు.. కలుస్తానని చెప్పానని తెలిపారు. కేసీఆర్ జాతీయ పార్టీ గురించి ఎలాంటి ప్రస్తావన రాలేదన్నారు.