మహిళలకు నచ్చే విధంగా చీరలు తేవడం అంటే మామూలు విషయం కాదు, వాళ్ల భర్తల వల్లే సాధ్యం కాదు, ఇక ప్రభుత్వం వల్ల ఏమవుతుంది

  • Published By: naveen ,Published On : September 29, 2020 / 01:27 PM IST
మహిళలకు నచ్చే విధంగా చీరలు తేవడం అంటే మామూలు విషయం కాదు, వాళ్ల భర్తల వల్లే సాధ్యం కాదు, ఇక ప్రభుత్వం వల్ల ఏమవుతుంది

ktr about batukamma sarees:హైదరాబాద్ టూరిజం ప్లాజాలో బతుకమ్మ చీర ప్రదర్శన-2020 కార్యక్రమానికి మంత్రులు కేటీఆర్, సబిత, సత్యవతి రాథోడ్ వెళ్లారు. మంత్రులు బతుకమ్మ చీరలను పరిశీలించారు. చేనేతల మరమగ్గాలపై బతుకమ్మ చీరలు తయారు చేశారు. ఈ ఏడాది 287 విభిన్న డిజైన్లతో బతుకమ్మ చీరలను తయారు చేయించారు. బతుకమ్మ చీరల కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.317.81 కోట్లు ఖర్చు చేసింది. కోటికిపైగా చీరలు పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే అన్ని జిల్లాలకు చీరలు చేరాయి.

అక్టోబర్ రెండో వారంలో(అక్టోబర్ 9) బతుకమ్మ చీరలు పంపిణీ చేయనున్నారు. బతుకమ్మ చీరలను పరిశీలించిన మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. బతుకమ్మ చీరలతో నేతన్నలకు ఉపాధి దొరుకుతుందన్నారు. 26వేల పవర్ లూమ్స్ కు పని దొరికిందన్నారు. బతుకమ్మ చీరల కోసం రూ.1,033 కోట్లు ఖర్చు చేశామన్నారు. 4 కోట్ల బతుకమ్మ చీరలు తయారు చేసినట్టు మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రభుత్వం చర్యలతో నేతన్నల ఆత్మహత్యలు తగ్గాయన్నారు.


ఈ సందర్భంగా కేటీఆర్ తన మాటలతో నవ్వులు పూయించారు. ఆడపిల్లలకు నచ్చే విధంగా చీరలు తేవడం అంటే మామూలు విషయం కాదని చెప్పారు. వాళ్ల భర్తల వల్లే సాధ్యం కాదు, ఇక ప్రభుత్వం వల్ల ఏమవుతుందని కేటీఆర్ అన్నారు. అక్కచెల్లెళ్లు ఏమీ అనుకోవద్దని కేటీఆర్ అన్నారు. కేటీఆర్ మాటలతో అక్కడ నవ్వులు విరబూసాయి.