KTR On Munugodu bypoll: మునుగోడు ఉప ఎన్నికపై మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

‘‘ఉప ఎన్నికలో పోటీ ఎవరి నడుమ? ఫ్లోరోసిస్ అనే భూతాన్ని నల్గొండ బిడ్డలకి శాపంలా ఇచ్చిన కాంగ్రెస్. ఫ్లోరోసిస్ నిర్మూలనకు నీతి ఆయోగ్ సిఫార్సు చేసినా మిషన్ భగీరథకు పైసా ఇవ్వని మానవత్వం లేని బీజేపీ. ఫ్లోరోసిస్ నుండి శాశ్వతంగా మిషన్ భగీరథ ద్వారా శాపవిముక్తి చేసిన తెరాస’’ అని పేర్కొన్నారు. ఈ మూడు పార్టీల నడుమ పోటీనా? అని నిలదీశారు. 

KTR On Munugodu bypoll: మునుగోడు ఉప ఎన్నికపై మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

KTR On Munugodu bypoll: మునుగోడు ఉప ఎన్నికపై మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మునుగోడులో జరిగే ఉప ఎన్నికలో పోటీ ఎవరి నడుమ?’ అని ప్రశ్నించారు. ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం నిన్న షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. మునుగోడు ఉప ఎన్నికను నవంబరు 3న నిర్వహించనున్నట్లు తెలిపింది. ఇందుకోసం ఈనెల 7న నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పింది. దీంతో ఈ ఎన్నికపై కేటీఆర్ స్పందిస్తూ.. ‘‘ఉప ఎన్నికలో పోటీ ఎవరి నడుమ? ఫ్లోరోసిస్ అనే భూతాన్ని నల్గొండ బిడ్డలకి శాపంలా ఇచ్చిన కాంగ్రెస్. ఫ్లోరోసిస్ నిర్మూలనకు నీతి ఆయోగ్ సిఫార్సు చేసినా మిషన్ భగీరథకు పైసా ఇవ్వని మానవత్వం లేని బీజేపీ. ఫ్లోరోసిస్ నుండి శాశ్వతంగా మిషన్ భగీరథ ద్వారా శాపవిముక్తి చేసిన తెరాస’’ అని పేర్కొన్నారు. ఈ మూడు పార్టీల నడుమ పోటీనా? అని నిలదీశారు.

ప్రధాని టేబుల్ మీద ఫ్లోరోసిస్ బాధితుడు స్వామి చిత్రం ఆనాటి దుస్థితికి సాక్ష్యం అంటూ కేటీఆర్ అప్పటి ఫొటోను పోస్ట్ చేశారు. దశాబ్దాలు అధికారంలో ఉన్నా స్వయంగా ప్రధానికి మొరపెట్టుకున్నా పైసా ఇవ్వలేదు, పరిష్కారం కాలేదని చెప్పారు. తెరాస ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన శాశ్వతంగా ఈ సమస్య తీర్చిన మాట వాస్తవమని కేంద్రమే పార్లమెంట్లో చెప్పిందని ట్వీట్ చేశారు. కాగా, మునుగోడు ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల కావడంతో ప్రధాన పార్టీల మధ్య మాట యుద్ధం పెరిగింది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

BJP slams ‘Adipurush’ director: ‘ఎన్టీఆర్‌ను చూసి నేర్చుకోండి’.. ‘ఆదిపురుష్’లో రావణుడిని చూపిన తీరుపై బీజేపీ విమర్శలు