తెలంగాణలో కరోనా కేసులు 24 గంటల్లో 1,445, కోలుకున్నది 1,486

  • Published By: madhu ,Published On : October 31, 2020 / 10:32 AM IST
తెలంగాణలో కరోనా కేసులు 24 గంటల్లో 1,445, కోలుకున్నది 1,486

COVID 19 in Telangana : తెలంగాణలో కొత్తగా 1,445 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి ఒక్క రోజే 1,486 మంది కోలుకున్నారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. మొత్తం కేసుల సంఖ్య 2 లక్షల 38 వేల 632గా ఉందని, కోలుకున్న వారి సంఖ్య 2 లక్షల 18 వేల 887గా ఉందని తెలిపింది.



https://10tv.in/wife-paramour-held-for-killing-husband-srikakulam-district/
24 గంటల్లో ఆరుగురు మరణించినట్లు, మరణాల రేటు విషయానికి వస్తే..0.56గా ఉందని తెలిపింది. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 18 వేల 409 ఉండగా, గృహ/సంస్థల ఐసోలేషన్ లో గల వ్యక్తుల సంఖ్య 15 వేల 439 గా వెల్లడించింది.



జిల్లాల వారీగా కేసులు : –
ఆదిలాబాద్ 19. భద్రాద్రి కొత్తగూడెం 90. జీహెచ్ఎంసీ 286. జగిత్యాల 35. జనగామ 25. జయశంకర్ భూపాలపల్లి 21. జోగులాంబ గద్వాల 10. కామారెడ్డి 22. కరీంనగర్ 65. ఖమ్మం 77. కొమరం భీం ఆసిఫాబాద్ 07. మహబూబ్ నగర్ 28.



మహబూబాబాద్ 19. మంచిర్యాల 18. మెదక్ 22. మేడ్చల్ మల్కాజ్ గిరి 122. ములుగు 22. నాగర్ కర్నూలు 23. నల్గొండ 102. నారాయణపేట 4. నిర్మల్ 22. నిజామాబాద్ 18. పెద్దపల్లి 25. రాజన్న సిరిసిల్ల 26. రంగారెడ్డి 107. సంగారెడ్డి 27. సిద్దిపేట 43. సూర్యాపేట 29. వికారాబాద్ 22. వనపర్తి 21. వరంగల్ రూరల్ 17. వరంగల్ అర్బన్ 53. యాదాద్రి భువనగిరి 18. మొత్తం : 1445