బీజేపీ ఏం చేసింది చెప్పండి ? కిషన్ రెడ్డికి మంత్రి కేటీఆర్ సవాల్

  • Published By: madhu ,Published On : November 21, 2020 / 09:52 PM IST
బీజేపీ ఏం చేసింది చెప్పండి ? కిషన్ రెడ్డికి మంత్రి కేటీఆర్ సవాల్

Minister KTR Road Show : ‘కిషన్ రెడ్డి..కేంద్రంలో మంత్రి అయి..రెండు సంవత్సరాలు అయ్యింది..ఢిల్లీలో ప్రభుత్వం వచ్చి ఆరేళ్లు అయ్యింది..తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందో వంద చెబుతా…హైదరాబాద్‌లో నీ పార్టీ..నీ ప్రభుత్వం..చేసింది ఒక్క పని చెప్పు…ఇది ఇచ్చినం..అది ఇచ్చినం…అంటరు..కానీ..ఆరేళ్లలో తెలంగాణ నుంచి మీరు..మేము..అందరం కలిసి కేంద్ర ప్రభుత్వానికి కట్టింది రూ. 2 లక్షల 72 వేల కోట్లు పన్నుల ద్వారా కడితే..లక్ష 40 వేల కోట్లు మాత్రమే తెలంగాణ కేంద్రం ఇచ్చింది..చారనా కోడికి బారానా మసాల అంటూ, ఫొజులు కొడుతున్నారు’..అంటూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ బీజేపీ పార్టీపై ఫైర్ అయ్యారు.



జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా ఆయన పలు ప్రాంతాల్లో రోడ్ షో నిర్వహించారు. 2020, నవంబర్ 21వ తేదీ శనివారం సాయంత్రం కుత్బుల్లాపూర్ లో నిర్వహించిన రోడ్ షోలో మంత్రి కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.



వర్షాలు, వరదలకు ప్రజలు బాధ పడితే..ఆరున్నర లక్షల మందికి రూ. 650 కోట్లు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వమని, కానీ..దీనికి అడ్డు తగిలింది ఎవరు ? ఎన్నికల కమిషన్ కు లెటర్ రాసింది ఎవరు ? అంటూ ప్రజలనుద్దేశించి ప్రశ్నించారు. ఏది పడితే..అది మాట్లాడుతున్నారని విమర్శించారు. మోడీకి చెప్పండి..కేసీఆర్ పది వేలు ఇస్తున్నారు..నేను రూ. 50 వేలు ఇస్తా..అని ఒక ప్రోగ్రాం తీసుకోవాలని కిషన్ రెడ్డికి సూచించారు.



ట్రిపుల్ రైడింగ్ చేస్తే..చలాన్ వేయవద్దని, మందు కొట్టి బండి నడిపినా..ఫైన్ వేయరంట..మొత్తం జీహెచ్ఎంసీ తో కట్టిస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. పిల్లగాడు చనిపోతే..ఎవరు బాధ్యత తీసుకుంటారు అని ప్రశ్నించారు. ఇంత బాధ్యతాయుతంగా మాట్లాడడం కరెక్టు కాదని, హైదరాబాద్ లో 5 లక్షల సీసీ కెమెరాలు ఉన్నాయన్నారు. ఎలాంటి శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా తాము వీటిని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.



58, 59 జీవోల కింద ఇచ్చిన..పట్టాల మీద స్థిరాస్థి హక్కు కల్పించండి..వాళ్లు బ్యాంకుకు పోతే..లోన్ వచ్చే విధంగా చేయాలని వివేక్ చెప్పారని సీఎం కేసీఆర్ ఆ పని తప్పకుండా చేస్తారన్నారు. పోటీ చేస్తున్న విజయ్ శేఖర్ గౌడ్, రషీదా బేగం, పారిజాత బేగం, పద్మా ప్రతాప్ లను ప్రజలు గెలిపించాలన్నారు మంత్రి కేటీఆర్.