Etala Rajender : కన్నీరు పెడుతూ కూడా సంస్కారం లేకుండా మాట్లాడినావు : రేవంత్ వ్యాఖ్యలకు ఈటల కౌంటర్

రాహుల్ గాంధీకి శిక్ష పడితే బీఆర్ఎస్ చీకటి రోజు అంటూ మాట్లాడిందన్నారు. ధీరుడు, వీరుడు కన్నీరు పెట్టరని.. ఇదేం సంస్కృతో అర్థం కాలేదని చెప్పారు.

Etala Rajender : కన్నీరు పెడుతూ కూడా సంస్కారం లేకుండా మాట్లాడినావు : రేవంత్ వ్యాఖ్యలకు ఈటల కౌంటర్

Etala Rajender (2)

Etala Rajender : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు ఈటల కౌంటర్ ఇచ్చారు. తాను మొన్న ప్రెస్ మీట్ లో రేవంత్ రెడ్డి పేరు ఎక్కడ తీసుకోలేదని స్పష్టం చేశారు. జాతీయ రాజకీయాలు ఎలా ఉంటాయనే దానికి తాను సమాధానం చెప్పానని తెలిపారు. బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ కలసి పోరాటలు చేస్తున్నాయని వెల్లడించారు. మల్లికార్జున ఖర్గే, కేశవరావు ఇద్దరు కలిసి ప్రెస్ మీట్స్ పెట్టారని పేర్కొన్నారు.

రాహుల్ గాంధీకి శిక్ష పడితే బీఆర్ఎస్ చీకటి రోజు అంటూ మాట్లాడిందన్నారు. ధీరుడు, వీరుడు కన్నీరు పెట్టరని.. ఇదేం సంస్కృతో అర్థం కాలేదని చెప్పారు. కన్నీరు పెడుతూ కూడా సంస్కారం లేకుండా మాట్లాడినారని మండిపడ్డారు. ‘నీ అమ్మ, అబ్బా అంటూ మాట్లాడినాడు’ అని అన్నారు. రేవంత్ జైలుకు వెళ్లానని అంటున్నారు.. విద్యార్థి ఉద్యమంలోనే తాము జైలుకు వెళ్లామని చెప్పారు. తెలంగాణ ఉద్యమం సమయంలో రేవంత్ ఎక్కడున్నాడు..? చంద్రబాబు సంకలో చొచ్చిఉన్నాడని ఘాటుగా విమర్శలు చేశారు.

Kaushik Reddy : ఈటల రాజేందర్ ఎంతో మంది చావులకు కారకుడయ్యాడు : ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి

చంద్రబాబును అడ్డకుంటామంటే తుపాకీ పెట్టుకొని తెలంగాణ వాదులను బెరించారని తెలిపారు. ‘నీవు జైలు కు ఎందుకు వెళ్ళినావు.. ఓటుకు నోటుకు కేసులో జైలుకు వెళ్లినావు’ అని విమర్శించారు. ఇంకేదో కేసులో జైల్ కు వెళ్ళినావు కానీ, తెలంగాణ కోసం జైలుకు వెళ్లలేదన్నారు. 2018లో 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిస్తే 12 మంది టీఆర్ఎస్ లో చేర్చుకున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీని బ్రష్టు పట్టించింది బిఆర్ఎస్ కదా..? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ ఎంత ఖర్చు చేసి రేవంత్ రెడ్డిని, జానారెడ్డిని ఓడించిందన్నారు.

మునుగోడులో ఓటుకు రూ.6000 ఇచ్చింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీలిస్తే బీజేపీ ఒడిపోతుందని ప్లాన్ చేశారని పేర్కొన్నారు. మారిన పరిస్థితుల్లో పొత్తు ఉంటుందని కోమటిరెడ్డి, జానారెడ్డి మాట్లాడారని.. ఆశలు ఆడియశాలు అయ్యాయని రేవంత్ రెడ్డి ఎడ్చారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో పాతవారిని వెల్లగొట్టి సీఎం అవుదామనుకున్నాడని ఆరోపించారు. తనకు ఆయనకు పోలిక ఏంటీ..? తాను ఎందుకు జైల్ కు వెళ్లినా.. ఆయన ఎందుకు జైలుకు వెళ్ళినావో చెప్పాలన్నారు. తాను ఎక్కడ ఆర్టీఏ యాక్ట్ దరఖాస్తులు చేయలదని, బిల్డర్స్ ఫోన్లు చేయలేదని చెప్పారు.

Revanth Reddy: భాగ్యలక్ష్మి అమ్మవారిపై రేవంత్ రెడ్డి ప్రమాణం.. ఈటలపై భావోద్వేగభరిత వ్యాఖ్యలు

రేవంత్ ఆర్టీఏ యాక్ట్ దరఖాస్తుల కోసం ఏకంగా ఆఫీస్ ఓపన్ చేశాడని విమర్శించారు. ఒక ఉద్యమకారుడిని పట్టుకొని నీ అమ్మ అంటూ మాట్లాడినవు, నీకు అమ్మ లేదా..? నేను ఎప్పుడూ నీలాంటి వారి గురించి వ్యక్తిగతంగా మాట్లాడలేదన్నారు. అమ్మ తోడు, అక్క తోడు, పిల్లలతోడు అంటూ తాను మాట్లాడను.. పార్టీల కల్చర్ అది కాదని హితవు పలికారు. బీఆర్ఏస్ పార్టీతో రేవంత్ జతకట్టబోతున్నట్లు ఆరోపించారు. తమ పంచాయతీ కేసీఆర్ తోనని స్పష్టం చేశారు. ఇక్కడ సంపాదించినది చాలదు అన్నట్లు ఢిల్లీలో లిక్కర్ స్కామ్ చేశాడని విమర్శించారు.

రేవంత్ ఎప్పుడైన లిక్కర్ స్కామ్ పై మాట్లాడనివా..? అని నిలదీశారు. రాత్రి పూట ఫోన్లు చేసి తిట్టిపించడం సరికాదని హితవు పలికారు. దమ్ముంటే రా చూసుకుందాం.. మమ్మల్ని అడ్డుకుంటావా రా.. నీవు తిరగగలవా..? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చిన్న కార్యక్రమం చేసిన పోలీసులు అడ్డుకుంటారని.. శనివారం మాత్రం రోడ్డు క్లియర్ చేశారు..దీని వెనుక ఎవరు ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కి బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇవ్వలేదా..? అని ప్రశ్నించారు.

Etala Rajender : సీఎం కేసీఆర్ పై ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ కోవర్టులు ఉన్నారని రేవంత్ రెడ్డినే అన్నారని.. వారి పేరు ఆయనే చెప్పాలన్నారు. కౌశిక్ రెడ్డి ఓ మెంటల్ గాడని మండిపడ్డారు. 2018లో 12 మంది ఎమ్మెల్యేలకు డబ్బులు ఇచ్చాడని అందులో కౌశిక్ రెడ్డి ఒకరని అన్నారు. డబ్బులు ఇచ్చినవాడు, తీసుకున్నాడు చెప్పాడా..? ఎలక్షన్ టైమ్ లో పోలీసులే డబ్బులు తరలిస్తున్నారని ఆరోపించారు. హుజురాబాద్ లో ఏకంగా పోలింగ్ ఆఫీసరే రూ.2కోట్లు తెచ్చాడని విమర్శించారు. CPI, CPM, బిఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటారని ఆరోపించారు.

రైతులపై వర్షం ఒక్కసారి కాదు రెండు, మూడు సార్లు పంజా విసిరిందని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. పంట నష్టం పరిశీలించిన మంత్రులు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు. బీజేపీ తరుపున పరకాలలో తాను పర్యటన చేసిన చూసి వచ్చానని చెప్పారు. పసల్ బీమా యోజన ఉన్నా బాగుండేది అని రైతులు బాధ పడపడ్డారని తెలిపారు. సీఎం కేసీఆర్ తమ వెనుక హెలికాప్టర్లలో వచ్చాడని పేర్కొన్నారు.

Etela Rajender: గుళ్లకు వెళ్లి.. అమ్మ తోడు, అయ్య తోడు అనడం ఏంటీ?: స్పందించిన ఈటల

కౌలు రైతుల కూడా రూ.10వేల నష్టం పరిహారం ఇస్తానన్నాడు కానీ ఇవ్వలేదని విమర్శించారు. శనివారం గాలి దుమారానికి రైతులు పంటలు నష్టపోయారని పేర్కొన్నారు. వెంటనే వారికి రూ.20 వేల నష్టం పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నానని పేర్కొన్నారు. IKP సెంటర్స్ లో వర్షానికి ధాన్యం తడిసిపోయిందని.. దానిని వెంటనే కొనుగోలు చేయాలన్నారు.