Telangana : నల్లగొండ అభివృద్ది కోసం నా చివరి రక్తపుబొట్టు వరకు పాటుపడుతా : ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి

నల్గొండకు అడిగిన వెంటనే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ రూ. 75 కోట్లతో ఐటీ హబ్ ను మంజూరు చేశారు. ఈ ఐటీ హబ్ ను సెప్టెంబర్ నెలలో ప్రారంభించుకునేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Telangana : నల్లగొండ అభివృద్ది కోసం నా చివరి రక్తపుబొట్టు వరకు పాటుపడుతా : ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి

MLA Kancharla Bhupal Reddy

Nalgonda IT Hub in Telangana : నల్లగొండ అభివృద్ధి గురించి గత పాలకు ఏమీ చేయలేదని కానీ బీఆర్ఎస్ పాలనలో అభివృద్ది జరుగుతోందని దాని నిదర్శనమే ఐటీ హబ్ అని అన్నారు ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి. నల్గొండలోని నూతనంగా నిర్మితమవుతున్న ఐటీ హాబ్ ప్రాంగణంలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతు.. ఐటీ హాబ్ తెస్తామని చెప్పిన గత పాలకులు చెప్పిన మాటలు నీటి మూటలు నీటి మూటలుగా మిగిలిపోయాయని..కానీ నల్గొండకు అడిగిన వెంటనే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ రూ. 75 కోట్లతో ఐటీ హబ్ ను మంజూరు చేశారని తెలిపారు. నల్గొండకు అడిగిన వెంటనే సీఎం కేసీఆర్, కేటీఆర్ రూ. 75 కోట్లతో ఐటీ హబ్ ను మంజూరు చేశారని తెలిపారు. నల్లగొండకు మంజూరు చేసిన ఈ ఐటీ హబ్ ను సెప్టెంబర్ నెలలో ప్రారంభించుకునేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు.

అమెరికాలో 16 సంస్థలతో ఒప్పందం జరిగిందని ఈ ఐటీ హడ్ ఏర్పాటుతో 1500మందికి ఉద్యోగ అవకాశాలు కలుగుతుందని తెలిపారు. మరో ఆరు నెలల్లో మెడికల్ కాలేజీని కూడా ప్రారంభించుకోనున్నాం..గత పాలకుల చేతుల్లో నలిగిపోయియిన నల్గొండలో నేడు నలువైపులా అభివృద్ధి చెందుతోందన్నారు. బీఆర్ఎస్ పాలనలో పలు అభివృద్ధి పనుల ప్రారంభానికి జూన్ రెండో వారంలో మంత్రి కేటీఆర్ నల్గొండకు రాబోతున్నారని తెలిపారు.

ఇరవై ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్నా అభివృద్ధి చేయకుండా…..కళ్లు లేని వారిలా అభివృద్ధి ఎక్కడ జరిగిందని అంటున్నారంటూ ప్రతిపక్షంపై మండిపడ్డారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక అనవసరమైన విషయాల్లో లేనిపోని విమర్శలు చేస్తున్నారని నిజమేదో ప్రజలు గుర్తిస్తారని అన్నారు. నల్లగొండ అభివృద్ది కోసం నా చివరి రక్తపుబొట్టు వరకూ పాటుపడుతానని తెలిపారు. నాణ్యతతో నా హయాంలో చేసిన పనులపై విజిలెన్స్ తనిఖీలకు సిద్ధంగా ఉన్నానని..పదవులు, ఆస్తుల కోసం ప్రజలను ఆకట్టుకునేలా చేసిన డ్రామాలాడే వారు ఇటువంటి విమర్శలు చేస్తుంటారని కానీ నాణ్యత విషయంలో చర్చకు నేను సిద్ధంగా ఉన్నానని..గత పాలకుల హయాంలో… ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి పై చర్చకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి.