MLC Kavitha: ఈడీ విచారణకు వెళ్తుండగా ఆసక్తికర పరిణామం.. రెండు చేతులు ఎత్తి 2 సార్లు ఫోన్లు చూపించిన కవిత

ఢిల్లీ లిక్కర్ స్కాం​ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వరుసగా రెండో రోజు ఈడీ విచారణకు హాజరయ్యారు. అంతకు ముందు ఢిల్లీలోని తుగ్లక్ రోడ్డులోని సీఎం కేసీఆర్ నివాసం నుంచి బయటకు వచ్చి, కారు ఎక్కే సమయంలో ఫోన్లను చూపించారు. తాను ఫోన్లు ధ్వంసం చేయలేదన్న సంకేతాన్ని ఇచ్చారు.

MLC Kavitha: ఈడీ విచారణకు వెళ్తుండగా ఆసక్తికర పరిణామం.. రెండు చేతులు ఎత్తి 2 సార్లు ఫోన్లు చూపించిన కవిత

MLC Kavitha

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాం​ కేసు (Delhi liquor scam)లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) వరుసగా రెండో రోజు ఈడీ విచారణకు హాజరయ్యారు. అంతకు ముందు ఢిల్లీలోని తుగ్లక్ రోడ్డులోని సీఎం కేసీఆర్ నివాసం నుంచి బయటకు వచ్చి, కారు ఎక్కే సమయంలో ఫోన్లను చూపించారు. తాను ఫోన్లు ధ్వంసం చేయలేదన్న సంకేతాన్ని ఇచ్చారు. “ఇవిగో ఫోన్లు.. నేనెక్కడ ధ్వంసం చేశా?” అన్నట్లుగా ఆమె వ్యవహరించారు.

ఆ ఫోన్లను కవర్లలో పెట్టుకుని తన వద్దే ఉంచుకున్నారు. ఆ ఫోన్లను ఈడీకి చూపించడానికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈడీ కార్యాలయం వద్ద కారు దిగిన సమయంలోనూ కవిత ఆ ఫోన్లను మీడియాకు చూపించారు. కాగా, ఇవాళ ఉదయం న్యాయనిపుణులతో కవిత చర్చించారు. నిన్న ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కవితను ఈడీ అధికారులు విచారించిన విషయం తెలిసిందే.

ఢిల్లీ లిక్కర్ స్కాం​ కేసులో కవిత ఈ నెల విచారణకు హాజరు అవుతుండడం ఇది మూడవసారి. ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి చేరుకున్న ఆమె లోపలికి వెళ్లారు. కవితతో పాటు ఈడీ కార్యాలయానికి పలువురు బీఆర్ఎస్ నేతలు వచ్చారు. నిన్న అరుణ్ పిళ్లైతో కలిసి కవితను ఈడీ అధికారులు విచారించిన విషయం తెలిసిందే.

MLC Kavitha Phonesఈడీ కార్యాలయంలో మహిళలను విచారించడంపై ఈ నెల 24న సుప్రీంకోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో ఆ విచారణ అనంతరమే హాజరవుతానని ముందుగా కవిత అన్నారు. అయితే, అందుకు ఈడీ ఒప్పుకోలేదు. కొందరు మంత్రులు, టీఆర్ఎస్ నేతలు ఢిల్లీలో ఉన్నారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో బీఆర్‌‌‌‌ఎస్ ఎంపీలంతా ఢిల్లీలోనే ఉన్నారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ సెక్షన్ 50 కింద కవిత స్టేట్ మెంట్ ను ఈడీ రికార్డు చేస్తోంది.

సౌత్ గ్రూప్ నుంచి ఎమ్మెల్సీ కవితను కీలక వ్యక్తిగా ఈడీ పేర్కొంది. సౌత్ గ్రూప్ పాత్ర,100 కోట్ల ముడుపుల వ్యవహారాలు, నిందితులతో సంబంధాలు, డీలర్ కమిషన్ పెంచడం, లిక్కర్ వ్యాపారులకు అనుకూలంగా పాలసీలో మార్పులపై ఢిల్లీ, హైదరాబాద్ లో జరిగిన సమావేశాలపై కవితను ఈడీ ప్రశ్నిస్తోంది.

Lok Sabha elections-2024: ఇలాగైతే బీజేపీని వచ్చే ఎన్నికల్లోనూ ఓడించలేం: ప్రశాంత్ కిశోర్