Monkeys Gang War : గోడలెక్కి మరీ కొట్లాట.. టెన్షన్ పెట్టిన కోతుల గ్యాంగ్ వార్

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం దత్తప్పగూడెంలో పెద్ద గ్యాంగ్ వార్ జరిగింది. వివాదం ఏంటో తెలియదు కానీ, అప్పటిదాకా కలిసున్న గ్రూపులు రెండు వర్గాలు విడిపోయాయి. గోడలెక్కి మరీ కలబడ్డాయి. బిడ్డలను ఎత్తుకుని మరీ ఫైటింగ్ చేశాయి.

Monkeys Gang War : గోడలెక్కి మరీ కొట్లాట.. టెన్షన్ పెట్టిన కోతుల గ్యాంగ్ వార్

Monkeys Gang War

Monkeys Gang War : యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం దత్తప్పగూడెంలో పెద్ద గ్యాంగ్ వార్ జరిగింది. వివాదం ఏంటో తెలియదు కానీ, అప్పటిదాకా కలిసున్న గ్రూపులు రెండు వర్గాలు విడిపోయాయి. గోడలెక్కి మరీ కలబడ్డాయి. బిడ్డలను ఎత్తుకుని మరీ ఫైటింగ్ చేశాయి.

యాదాద్రి భువనగిరి జిల్లాలో కోతులు హల్ చల్ చేశాయి. రెండు గ్రూపులుగా విడిపోయిన వానరాలు దాడులు చేసుకున్నాయి. గోడ మీద అరగంటపాటు ఫైటింగ్ చేశాయి. కిందికి దిగాక కూడా అరగంట పాటు కరుచుకున్నాయి. దత్తప్పగూడెన్ని కిష్కిందగా మార్చాయి వానరాలు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

మోత్కురు మండలంలోని దత్తప్పగూడెనికి ఆహారాన్ని వెతుక్కుంటూ పెద్ద సంఖ్యలో కోతులు వచ్చాయి. కాసేపు ఆహారం కోసం వేట సాగించాయి. డ్రమ్ములు, బకెట్లలోని నీరు తాగాయి. ఓ ఇంటి గోడ మీద నుంచి వెళ్లే సమయంలో కోతుల మధ్య కొట్లాట షురూ అయ్యింది. అంతే.. గట్టిగా అరుచుకుంటూ పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఒకదాని మీద మరొకటి పడి కొరికేసున్నాయి. గోళ్లతో గీకేసుకున్నాయి. అలా గంట పాటు కోతుల మధ్య గ్యాంగ్ వార్ నడిచింది.

Monkeys:కోతుల నుంచి తప్పించుకోబోయి బాలింత మృతి

అలా గోడ మీద చాలాసేపు కోతులు ఫైటింగ్ చేశాయి. ఆ తర్వాత కిందకు దిగాయి. ఇక గోడ మీద ఫైటింగ్ అయిపోయిందని స్థానికులు అనుకునేలోపే కింద కూడా కోతులు కొట్లాటకు దిగాయి. ఒక గ్రూపు తరిమితే మరో గ్రూపు పరిగెత్తింది. ఇలా గంటపాటు కోతులు కొట్లాడాయి. దత్తప్పగూడెన్ని కిష్కిందగా మార్చేశాయి వానరాలు. కోతుల మధ్య గ్యాంగ్ వార్ చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుంతో అర్థం కాక కంగారు పడ్డారు. బాహుబలి సినిమాలో ఫైటింగ్ రేంజ్ లో కోతుల మధ్య కొట్లాట చూసి కాస్త ఆందోళన చెందారు.

Monkeys Social Media : కోతులకూ పాకిన సోషల్ మీడియా పిచ్చి