Jayasudha: బీజేపీలోకి సినీనటి జయసుధ..? ఆ పార్టీ ముఖ్య‌నేతలతో సంప్రదింపులు

సినీ నటి, రాజకీయ నాయకురాలు జయసుధ త్వరలో బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ అగ్ర నాయకత్వంతో ఆమె పలు దఫాలుగా సంప్రదింపులు జరిపినట్లు సమాచారం.

Jayasudha: బీజేపీలోకి సినీనటి జయసుధ..? ఆ పార్టీ ముఖ్య‌నేతలతో సంప్రదింపులు

Jayasudha

Jayasudha: సినీ నటి, రాజకీయ నాయకురాలు జయసుధ త్వరలో బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ అగ్ర నాయకత్వంతో ఆమె పలు దఫాలుగా సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. ఇదిలాఉంటే తెలంగాణలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే లక్ష్యంగా బీజేపీ వేగంగా పావులు కదుపుతోంది. రాష్ట్ర నాయకత్వంతో పాటు కేంద్ర అగ్ర నాయకత్వంసైతం తెలంగాణపై దృష్టి కేంద్రీకరించారు. ఇప్పటికే టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లోని అసంతృప్త నేతలను బీజేపీలోకి చేర్చుకొనేందుకు సిద్ధమయ్యారు. తాజాగా బీజేపీ మొదలు పెట్టిన ఆపరేషన్ ఆకర్ష్ తో కాంగ్రెస్ కు తెలంగాణలో గట్టి ఎదురు దెబ్బతగిలింది.

Telangana BJP : తెలంగాణలో సైలెంట్‌గా కల్లోలం సృష్టిస్తున్న బీజేపీ.. అధికారమే లక్ష్యంగా వ్యూహాలు

ఆ పార్టీకి చెందిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. మరో కాంగ్రెస్ కీలక నేత దాసోజు శ్రవణ్ సైతం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. టీఆర్ ఎస్ నుంచి సైతం పలువురు బీజేపీలోకి చేరేందుకు సిద్ధంగా ఉన్నారని కమలనాధులు పేర్కొంటున్నారు. తాజాగా తెలంగాణలో ప్రజాబలమున్న నేతలను గుర్తించి వారిని బీజేపీలోకి ఆహ్వానించేలా ఆ పార్టీ ప్రత్యేక కమిటీని సైతం ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో బీజేపీ చేరికల కమిటీ సినీ నటి, రాజకీయ నాయకురాలు జయసుధతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. పలు దఫాలుగా జయసుధ, బీజేపీ కీలక నేతల మధ్య చర్చలు జరిగినట్లు, ఆమె త్వరలో బీజేపీ తీర్థం పుచ్చుకుంటారన్న ప్రచారం సాగుతుంది.

Telangana BJP: 21 నుంచి బీజేపీ ముఖ్య‌నేత‌ల బైక్ ర్యాలీ యాత్ర‌లు

జయసుధ వైఎస్ఆర్ హాయాంలో కాంగ్రెస్ లో కీలకంగా వ్యవహరించారు. 2009లో సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా పనిచేసిన జయసుధ, చివరగా వైస్సార్ సీపీలో పనిచేశారు. 2014 ఎన్నికల తరువాత రాజకీయాలకు కొంచెం దూరంగా ఉంటూ వస్తున్నారు. మళ్లీ తెలంగాణ రాజకీయాల్లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆమెను బీజేపీ నేతలు ఆహ్వానించడం, జయసుధ సైతం అందుకు అంగీకరించి బీజేపీ కండువా కప్పుకొనేందుకు సిద్ధమైనట్లు సమాచారం.