Viral News: కన్నీరు పెట్టుకున్న మున్సిపల్ కమిషనర్.. వారిలో మార్పురావడం లేదంటూ ఆవేదన

తెలంగాణలోని పల్లెలు, పట్టణాలను శుభ్రంగా తీర్చిదిద్దేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు కృషిచేస్తున్నారు. ముఖ్యంగా పట్టణాల్లో పట్టణ ప్రగతి పేరుతో మురుగు కాల్వల్లో చెత్తను తొలగిస్తూ, పరిసరాల పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.

Viral News: కన్నీరు పెట్టుకున్న మున్సిపల్ కమిషనర్.. వారిలో మార్పురావడం లేదంటూ ఆవేదన

Plastic

Viral News: తెలంగాణలోని పల్లెలు, పట్టణాలను శుభ్రంగా తీర్చిదిద్దేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు కృషిచేస్తున్నారు. ముఖ్యంగా పట్టణాల్లో పట్టణ ప్రగతి పేరుతో మురుగు కాల్వల్లో చెత్తను తొలగిస్తూ, పరిసరాల పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ప్రధానంగా ప్లాస్టిక్ నిషేదంపైనా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ప్లాస్టిక్ నిషేధంపై ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ప్రచారం చేస్తున్నా కొందరిలో మార్పు రావడం లేదు.

Viral Video: పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న ఏనుగు.. వీడియో పోస్టు చేసిన ఆనంద్ మహింద్రా.. ప్రీతి జింటా ఏమందంటే..

జగిత్యాల పట్టణంలోని ఓ వార్డులో ప్రధాన కాల్వలో ప్లాస్టిక్ వ్యర్థాల కారణంగా మురుగునీరు పేరుకుపోయింది. శనివారం పారిశుధ్య కార్మికులు వ్యర్థాలను తొలగించేందుకు ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో ఓ కార్మికుడు జారి కిందపడబోతుండటంతో తోటికార్మికులు పట్టుకున్నారు. అక్కడే ఉండి వీరి ఇబ్బందులు గమనించి మున్సిపల్ కమిషనర్ ఒక్కసారిగా కన్నీరు పెట్టుకున్నారు. ప్రజల్లో ఎంత అవగాహన కల్పించిన ప్లాస్టిక్ వ్యర్థాలను మురుగు కాల్వల్లోనే వేస్తున్నారని, దీంతో వాటిని తొలగించే క్రమంలో కార్మికుల కష్టాలు వర్ణణాతీతం అంటూ ఆమె కన్నీరుపెట్టుకున్నారు.