Double Decker Buses : భలేగున్నాయ్.. 20ఏళ్ల తర్వాత హైదరాబాద్ రోడ్లపైకి మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులు

డబుల్ డెక్కర్ బస్సులు హైదరాబాద్ చేరుకున్నాయి. మూడు డబుల్ డెక్కర్ బస్సులను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. గ్రోత్ కారిడార్ లో డబుల్ డెక్కర్ బస్సులు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ రోడ్లపై డబుల్ డెక్కర్ బస్సులు చక్కర్లు కొట్టనున్నాయ్. పర్యావరణహితంగా ఉండేందుకు ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం.

Double Decker Buses : భలేగున్నాయ్.. 20ఏళ్ల తర్వాత హైదరాబాద్ రోడ్లపైకి మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులు

Double Decker Buses : డబుల్ డెక్కర్ బస్సులు హైదరాబాద్ చేరుకున్నాయి. మూడు డబుల్ డెక్కర్ బస్సులను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. గ్రోత్ కారిడార్ లో డబుల్ డెక్కర్ బస్సులు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ రోడ్లపై డబుల్ డెక్కర్ బస్సులు చక్కర్లు కొట్టనున్నాయ్. పర్యావరణహితంగా ఉండేందుకు ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం.

పర్యాటక ప్రాంతాల్లో ఈ బస్సులను నడపనున్నారు. నగరంలోని ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, ప్యారడైజ్ రేస్ ట్రాక్ చుట్టూ కూడా ఈ బస్సులు నడవనున్నాయ్. ఈ నెల 11 తర్వాత నగరంలోని హెరిటేజ్ సర్క్యూట్ లో నడపాలని అధికారులు భావిస్తున్నారు. ఏకంగా 65 మంది ప్రయాణికులు కూర్చునేలా ఈ బస్సులను డిజైన్ చేశారు. బస్సుని ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 150 కిలోమీటర్లు ప్రయాణిస్తాయి.

Also Read..KCR Focus Maharashtra : 24 గంటలు ఉచిత విద్యుత్, కుటుంబానికి రూ.10లక్షలు.. మహారాష్ట్రపై ఫోకస్ పెంచిన కేసీఆర్

మొత్తానికి 20ఏళ్ల తర్వాత మళ్లీ హైదరాబాద్ రోడ్లపైకి డబుల్ డెక్కర్ బస్సులు వచ్చాయి. గత డబుల్ డెక్కర్ బస్సులకు భిన్నంగా ఈ బస్సులు ఉన్నాయి. ఇవి పర్యావరణహితం. హైదరాబాద్ లో డబుల్ డెక్కర్ బస్సులను ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఓ సిటిజన్ మంత్రి కేటీఆర్ కు ట్విట్టర్ లో రిక్వెస్ట్ చేశారు. ఈ రిక్వెస్ట్ ను మంత్రి కేటీఆర్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అలా మళ్లీ నగరంలోకి డబుల్ డెక్కర్ బస్సులు వచ్చాయి.

హెచ్ఎండీఏ ద్వారా మొత్తం 6 డబుల్ డెక్కర్ బస్సుల కొనుగోలుకు ప్రభుత్వం ప్లాన్ చేసింది. మొదటి దశలో భాగంగా మూడు డబుల్ డెక్కర్ బస్సులు వచ్చాయి. మంత్రి కేటీఆర్ ఈ బస్సులను ప్రారంభించారు. ఒక్కో బస్సు ఖరీదు రూ.2.16 కోట్లు. వీటిని ఏడేళ్ల పాటు వాళ్లే మెయింటైన్ చేయనున్నారు. హుస్సేన్ సాగర్, ఎన్టీఆర్ మార్గ్ చుట్టుపక్కల ఉండే వారిని డ్రాప్ చేసేందుకు వీటిని ఉపయోగించనున్నారు.

Also Read..Frank Hoogerbeets : టర్కీ, సిరియాలో భారీ భూకంపాన్ని ముందే ఊహించిన ఫ్రాంక్.. 3రోజుల క్రితమే ట్వీట్

హైదరాబాద్ నగరంలో ఉన్న హెరిటేజ్ నిర్మాణాలను కలిపే విధంగా ఒక సర్క్యూట్ ఏర్పాటు చేసి ఆ రూట్ లో ఈ బస్సులను తిప్పాలన్నది ప్రధానంగా ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తంగా 20ఏళ్ల తర్వాత మళ్లీ నగరవాసులు డబుల్ డెక్కర్ బస్సులను ఎక్కనున్నారు. ఓ కొత్త అనుభూతిని పొందనున్నారు. చాలామంది సిటిజన్లకు గతంలో డబుల్ డెక్కర్ బస్సులో ప్రయాణించిన అనుభవం ఉంటుంది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

చాలాకాలంగా హైదరాబాద్ నగరంలో డబుల్ డెక్కర్ బస్సులు తిరిగాయి. అయితే, కొంత ఇబ్బందికర పరిస్థితులు, ఆ బస్సులు పాడు కావడం, కొన్ని ప్రాంతాల్లో ఫ్లైఓవర్లు కొంత అడ్డంకిగా మారిన నేపథ్యంలో డబుల్ డెక్కర్ బస్సులు ఆపేశారు. ఇప్పుడు నగరంలో ఏయే రోడ్లలో అయితే ఇబ్బందులు ఉండవు, ఆయా రూట్లతో ఈ డబుల్ డెక్కర్ బస్సులు నడిపేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

భవిష్యత్తులో ఈ డబుల్ డెక్కర్ బస్సుల సంఖ్యను పెంచే ఛాన్స్ ఉంది. ప్రస్తుతానికి 6 బస్సులను ఆర్డర్ చేసిన హెచ్ ఎండీఏ వీటిని 20 బస్సులకు విస్తరించాలని ప్లాన్ చేస్తోంది. ఆ తర్వాత హైదరాబాద్ నగరంలోని ప్రధానమైన టూరిస్టు కేంద్రాలను కలిపే విధంగా ఒక సర్క్యూట్ ను ఏర్పాటు చేసి ఆ మార్గంలో నిత్యం ఈ డబుల్ డెక్కర్ బస్సులు ప్రయాణించేలా అధికారులు ప్లాన్ చేస్తున్నారు. నగరంలో లాంగ్ రన్ కోసం వీటిని ఉపయోగించనున్నారు.