Khammam: ఖమ్మంలో ‘కమ్మ’వార్.. కమ్మ సంఘంలో చీలిక..? కొత్త సంఘం ఏర్పాటు

ఖమ్మంలోని కమ్మ మహజన సంఘంకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పెద్ద సంఘంగా పేరుంది. సంఘం ద్వారా పేద విద్యార్థులను ఉచితంగా చదివించడంతో పాటు, పలు సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. అయితే గత కొంతకాలంగా కమ్మ మహజన సంఘంలో విబేధాలు నెలకొన్నాయి..

Khammam: ఖమ్మంలో ‘కమ్మ’వార్.. కమ్మ సంఘంలో చీలిక..? కొత్త సంఘం ఏర్పాటు

Khammam

Khammam: ఖమ్మంలోని కమ్మ మహజన సంఘంకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పెద్ద సంఘంగా పేరుంది. సంఘం ద్వారా పేద విద్యార్థులను ఉచితంగా చదివించడంతో పాటు, పలు సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. అయితే గత కొంతకాలంగా కమ్మ మహజన సంఘంలో విబేధాలు నెలకొన్నాయి. గత కొద్ది నెలల క్రితం జరిగిన సంఘం ఎన్నికలతో అవి తారాస్థాయికి చేరాయి. ఆ ఎన్నికల్లో ఎర్నేని రామారావు ప్యానెల్ విజయం సాధించింది. బిక్కసాని ప్యానెల్ ఓటమి పాలైంది. అయితే బిక్కసాని ప్యానెల్ వెంట ప్రస్తుత మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఉన్నారనే వార్తలు వచ్చాయి. ఎర్నేని రామారావు ప్యానెల్ వెంట మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు ప్రస్తుత ఎంపీ నామా నాగేశ్వరరావులు మద్దతు ఇచ్చారని ప్రచారం జరిగింది.

Khammam Puvvada : ఖమ్మంలో పువ్వాడ తిరగకుండా అడ్డుకుంటాం జగ్గారెడ్డి హెచ్చరికలు

ఎన్నికల అనంతరం విజయం సాధించిన ప్యానెల్ ప్రమాణ స్వీకారం చేయడంతో పాటు, సంఘం ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా నూతన సంఘం తెరపైకి వచ్చింది. ఖమ్మం పట్టణంలో మరో కమ్మ సంఘాన్ని ఏర్పాటు చేయడంతో పాటు ఆదివారం సాయంత్రం ఖమ్మం నగర కమ్మ సంఘం ఆవిర్భావ సభను నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. సాయంత్రం 6 గంటలకు ఖమ్మం పట్టణంలో ఈ ఆవిర్భావ సభను నిర్వహించనున్నారు. అయితే ఈ సభకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో పాటు ఎంపీ నామానాగేశ్వరావు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులు హాజరతున్నారని నూతన సంఘం విడుదల చేసిన ఆహాన పత్రికల్లో ప్రచురించారు. దీనిని తుమ్మల నాగేశ్వరరావు ఖండించినట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఖమ్మం నగర కమ్మ సంఘం ఆవిర్భావ సభకు తాను హాజరు కావటం లేదని తుమ్మల తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. తన ప్రమేయం లేకుండా తన పేరును ప్రచురించడం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. కమ్మ సంఘంలో చీలిక తేవడం సరికాదని తుమ్మల సూచించినట్లు తెలుస్తోంది.

Revanth Reddy On Puvvada Ajay : కమ్మ కులం నుంచి పువ్వాడను బహిష్కరించాలి-రేవంత్ రెడ్డి

మరోవైపు ఖమ్మం ఎంపీ నామానాగేశ్వరరావుసైతం తనకు సమాచారం లేకుండానే తన పేరును ప్రచురించారని, ఖమ్మం నగర కమ్మ సంఘం ఆవిర్భావ సభకు తాను హాజరు కావటం లేదని చెప్పినట్లు సోషల్ మీడియాలో నామా నాగేశ్వరరావు పేరుతో ఉన్న మెస్సేజ్ లు చక్కర్లు కొడుతున్నాయి. తాజా పరిస్థితులను చూస్తే తుమ్మల, నామానాగేశ్వరరావు ఈ ఆవిర్భావ సభకు గైర్హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ముఖ్యఅతిథిగా ఆదివారం సాయంత్రం ఖమ్మం పట్టణంలోని సీక్వెల్ రిసార్ట్స్ లో ఖమ్మం నగర కమ్మ సంఘం ఆవిర్భావ సభ జరగనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఖమ్మం నగర కమ్మ సంఘం ఎవరికి పోటీగా ఏర్పాటు చేసింది కాదని ఆహ్వాన కమిటీ సభ్యులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఉన్న సంఘం ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయని, వాటికి అదనంగా సేవా కార్యక్రమాలను విస్తృతం చేసేందుకు నూతన సంఘాన్ని ఏర్పాటు చేసినట్లు వారు చెబుతున్నారు. ప్రస్తుతం ఖమ్మం పట్టణంకు మాత్రమే పరిమితమైన నూతన సంఘం ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.