Corona Third Wave : తెలంగాణలో థర్డ్‌వేవ్‌.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న డీహెచ్‌

తెలంగాణలో కరోనా థర్డ్ వేవ్‌ ముప్పుపై ఇంకా సరైన ఆధారాలు ప్రజారోగ్య డైరక్టర్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.

Corona Third Wave : తెలంగాణలో థర్డ్‌వేవ్‌.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న డీహెచ్‌

Corona Third Wave

Corona Third Wave : తెలంగాణలో కరోనా థర్డ్ వేవ్‌ ముప్పుపై ఇంకా సరైన ఆధారాలు ప్రజారోగ్య డైరక్టర్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. కోవిడ్‌ తీవ్రత తగ్గినప్పటికీ ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని సూచించారు. రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి పూర్తిస్థాయిలో అదుపులో ఉందని డీహెచ్‌ శ్రీ‌నివాస‌రావు తెలిపారు.

మన దేశంలో వెలుగు చూసిన కరోనా వైరస్ డెల్టా వేరియంట్ ఇప్పుడు విదేశాల్లో తీవ్ర ప్రభావం చూపిస్తోందని డీహెచ్ శ్రీనివాసరావు అన్నారు. వైరస్ తీవ్రంగా ప్రభావం చూపిన తర్వాత పుట్టే కొత్త వైరస్‌లు బలహీనంగా ఉంటాయని, వాటి ప్రభావం అంతంత మాత్రమేనని అన్నారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి తెలంగాణలో మూడో దశ వచ్చే అవకాశం లేదని తేల్చి చెప్పారు. వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఉద్ధృతి కనిపించినా దాని తీవ్రత చాలా తక్కువగా ఉంటుందని, కాబట్టి థర్డ్ వేవ్‌పై ఆందోళన అవసరం లేదన్నారు.

మరోవైపు రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతోందని డీహెచ్‌ తెలిపారు. ఇప్పటివరకు 1.20కోట్ల మందికి వ్యాక్సిన్‌ ఇచ్చినట్లు చెప్పారు. ఈ నెల 15 నుంచి ఆగస్టు 15 వరకు దాదాపు 30లక్షల మందికి పైగా రెండో డోస్‌ వ్యాక్సిన్‌ తీసుకొనే వారు ఉన్నారన్నారు. హైదరాబాద్‌ నగరంలో 100కు పైగా టీకా కేంద్రాల్లో 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్‌ అందిస్తున్నట్లు వివరించారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో గత రెండేళ్ల నుంచి సీజనల్‌ వ్యాధులు చాలావరకు తగ్గాయని డీహెచ్‌ తెలిపారు. నీటి ద్వారా ప్రబలే వ్యాధులు మిషన్‌ భగీరథ నీటి వల్ల తగ్గాయన్నారు.