Covid-19 : ప్రజలు మళ్లీ కరోనా నిబంధనలు పాటించాలి-డీహెచ్ శ్రీనివాసరావు

కరోనా వైరస్ ఇంకా పోలేదని... ప్రజలు జాగ్రత్తలు  పాటించాలని తెలంగాణ ప్రజారోగ్య శాఖ సంచాలకులు శ్రీనివాసరావు చెప్పారు.

Covid-19 : ప్రజలు మళ్లీ కరోనా నిబంధనలు పాటించాలి-డీహెచ్ శ్రీనివాసరావు
ad

Covid-19 :  కరోనా వైరస్ ఇంకా పోలేదని… ప్రజలు జాగ్రత్తలు  పాటించాలని తెలంగాణ ప్రజారోగ్య శాఖ సంచాలకులు శ్రీనివాసరావు చెప్పారు. ప్రజలంతా కరోనా నిబంధనలు మళ్లీ పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దేశ వ్యాప్తంగా కరొనా కేసులు సంఖ్య పెరుగుతోందని… గడిచిన మూడు రోజులగా తెలంగాణలొ 100  సంఖ్యలో కేసులు పెరుగుతున్నాయని ఆయన వివరించారు.

రాష్ట్రంలో ఎక్కువ కేసులు హైదరాబాద్ రంగా రెడ్డి జిల్లాల్లో  నమోదవుతున్నాయని ఆయన అన్నారు. గత మూడు నెలల తర్వాత  కేసుల పెరుగుదల స్పష్టంగా తెలుస్తోందని ఆయన తెలిపారు.  రాష్ట్రంలో  ఒమిక్రాన్ BA2 వెరియంట్ కేసులు నమోదవుతున్నాయని వీటిలో స్వల్ప లక్షణాలు మాత్రమే కన్పిస్తున్నాయని ఆయన చెప్పారు. ఈ వ్యాధి బారిన పడిన వారికి జలుబు, గొంతు నొప్పి మాత్రమే వస్తోందని ఆయన తెలిపారు. ఎవరికైనా ఇలాంటి లక్షణాలు ఉంటే దగ్గరల్లొని ప్రభుత్వ హాస్పిటల్లో టెస్టులు చేయించుకోవాలను సూచించారు.

జూన్ 3వ తేదీ నుండి ఇంటి ఇంటికి తిరిగి వ్యాక్సిన్ ఇస్తున్నామని….12నుండి 18ఏళ్ల లోపు వారికి వ్యాక్సిన్ అందుబాటులో ఉందన్నారు. GHMC పరిధిలో 12 నుండి 18 ఏళ్ల వారు వ్యాక్సిన్ తీసుకొని వారు చాల మంది ఉన్నారని శ్రీనివాసరావు అన్నారు. జూన్ 13 నుండి విద్యాసంస్థలు ప్రారంభం కాబోతుంది కాబట్టి వ్యాక్సిన్ తీసుకోని వారంతా తప్పని సరిగా వ్యాక్సిన్ తీసుకొవాలని సూచించారు. హైదరాబాద్ లొ డెంగీ కేసుల సంఖ్య పెరుగుతోంది. సీజనల్ వ్యాధుల సంఖ్యలో పెరుగుదల కన్పిస్తోంది. ఈ ఏడాది డెంగీ కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని శ్రీనివాసరావు వెల్లడించారు.

Also Read : WhatsApp Update: వాట్సప్ లేటెస్ట్ అప్‌డేట్.. ఒక్క గ్రూపుకు 512మంది