Hyderabad Crime : గచ్చిబౌలి దొంగతనం కేసును ఛేదించిన పోలీసులు

గచ్చిబౌలి దోపిడీకి పాల్పడిన వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ దోపిడీతో సంబంధం ఉన్న మరికొందరి కోసం గాలింపు చేపట్టారు

Hyderabad Crime : గచ్చిబౌలి దొంగతనం కేసును ఛేదించిన పోలీసులు

Hyderabad Crime (7)

Hyderabad Crime : గత వారం గచ్చిబౌలి నానక్‌రాంగూడలో జరిగిన చోరికేసును పోలీసులు ఛేదించారు. సీబీఐ అధికారులమంటూ రియల్టర్ ఇంట్లోకి చొరబడిన దొంగలు సుమారు కోటిరూపాయల విలువచేసే 1.44 కేజీల బంగారం.. రెండు లక్షల నగదు తీసుకోని ఉండాయించారు. నకిలీ సీబీఐ కార్డులతో వచ్చిన కొందరు వ్యక్తులు ఇంట్లో సోదాలు నిర్వహించి.. దొరికినకాడికి దోచుకెళ్లారు. దొంగతనం అనంతరం ఎటువంటి నోటీసులు ఇవ్వకపోవడంతో మోసపోయామని గ్రహించిన ఇంట్లోని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

చదవండి : Hyderabad Lok Adalat : లోక్‌అదాలత్‌‌లో 1755 కేసుల పరిష్కారం

దీంతో కేసు నమోదు చేసుకొని రంగంలోకి దిగిన పోలీసులు.. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించారు. దోపిడీకి పాల్పడింది.. రియల్టర్ సుబ్రహ్మణ్యం దగ్గర పనిచేసే వ్యక్తులే అని గుర్తించిన పోలీసులు ముఠాలోని ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వీరిని విచారిస్తున్నారు పోలీసులు. నిందితులంతా ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లాకు చెందినవారే అని తెలిపారు. ముగ్గురిని అదుపులిలోకి తీసుకోగా.. మరికొందరు పరారీలో ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు. ఇక, నిందితుల నుంచి చోరికి గురైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. మిగతా వారికోసం ప్రత్యేక బృందాలుగా ఏర్పడి తనిఖీ చేస్తున్నారు.

చదవండి : Hyderabad Covid : కోవిడ్ టెస్టులు..ఇండియాలో హైదరాబాద్ థర్డ్ ప్లేస్