Ponguleti Srinivasa Reddy : సొల్లు కబుర్లు, సొంత డబ్బాలు ట్రాప్ లో పడను.. ఎంత పెద్ద కొండనైనా ఢీ కొడతా..

అధికారమదంతో ఉన్న ప్రజా ప్రతినిధులు అవాకులు చెవాకులు పెలుతున్నారు. మందు పార్టీలు చేసుకుని బాటిళ్లకు బాటిళ్లు తెల్లార్లు కూర్చుని తాగారు.వంశ చరిత్ర అంటూ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్టాడుతున్నారు.. వారందరికి వడ్డీతో సహా ఇచ్చి పడేసే టైమ్ వచ్చింది..

Ponguleti Srinivasa Reddy : సొల్లు కబుర్లు, సొంత డబ్బాలు ట్రాప్ లో పడను.. ఎంత పెద్ద కొండనైనా ఢీ కొడతా..

Ponguleti Srinivasa Reddy

Ponguleti Srinivasa Reddy : బీఆర్ఎస్ పార్టీ (BRS Party)పై పొంగులేటి శ్రీనివాస రెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ కు వడ్డీతో సహా ఇచ్చి పడేస్తా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం (Khammam)లో ముఖ్య కార్యకర్తలతోను.. ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలతోను శుక్రవారం ఆయన సమావేశమయ్యారు. పొంగులేటి కాంగ్రెస్ లో చేరాలని కొత్తగూడెం (Kothagudem), భద్రాచలం (Bhadrachalam), ఇల్లందు (Yellandu), అశ్వారావుపేట నేతలు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఖమ్మం అసెంబ్లీ నుంచి పోటీ చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పొంగులేటి ఘాటు వ్యాఖ్యలతో బీఆర్ఎస్, సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ తన టార్గెట్ అని తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ కు వడ్డీతో సహా ఇచ్చిపడేస్తానన్నారు.

“అధికారమదంతో ఉన్న ప్రజా ప్రతినిధులు అవాకులు చెవాకులు పెలుతున్నారని.. మీ నాయకుడికి జెండా లేదు, అజెండా లేదు అని ఎగతాళిగా మాట్లాడారు.. మీ సొల్లు కబుర్లు, సొంత డబ్బాలు కొట్టుకునే మీ ట్రాప్ లో మేము పడం. ఒక పార్టీలోకి నేను వెళ్తున్నాను అని మీడియాలో చెప్పగానే.. మందు పార్టీలు చేసుకుని బాటిళ్లకు బాటిళ్లు తెల్లార్లు కూర్చుని తాగారు. వారం రోజుల నుంచి మాత్రం ఏమి తాగకపోయినా మీకు మళ్లీ గెలిచే అవకాశం వస్తుందో లేదో అని మీకు నిద్ర పట్టటంలేదు. కొంతమంది కళ్లున్నా చూడలేకపోతున్న ధృతరాష్ట్ర పాలకులు.. వంశ చరిత్ర అంటూ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్టాడుతున్నారు.

Ponguleti Srinivas Reddy : కాంగ్రెస్‌ గూటికి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి?

నేను ఒక్క మాట కూడా నీ గురించి మాట్లాడను.. NTR విగ్రహానికి పూలమాలలు వేస్తే.. పాలతో శుద్ధి చేయిస్తవా..? అదేనా నీ సంస్కృతి? గత ఐదు నెలలుగా కార్యకర్తలు ఇచ్చిన స్ఫూర్తితో నేను నడుస్తున్నా. రాష్ట్ర ప్రజల అందరి దృష్టి ఖమ్మం జిల్లా మీద ఉందనీ అది మీకు ఇచ్చిన ధైర్యమే. పార్టీలు, కుల, మతాలకు అతీతంగా అందరూ నన్ను ఆదరిస్తున్నారు. అoదరం కలిసి యుద్ధం చేద్దాం. నాకు పదవి కావాలంటే.. 2019లో పార్లమెంట్ సభ్యుడిగా నిలబడి ఉంటే పదవి అపుడే వచ్చేది. కానీ నాకు పదవి ముఖ్యం కాదు. ప్రజా సేవే ముఖ్యం. మీ అండతో.. మీరిచ్చే ధైర్యంతో పెద్దకొండను ఢీకొడతా.. నాకు నా కార్యకర్తలకు జరిగిన నష్టానికి బీఆర్ఎస్ కు వడ్డీతో సహా ఇచ్చిపడేస్తా.

మీ అందరి మదిలో ఏముందో నాకు అర్ధం అయింది. సమయం కోసం వేచి చూస్తున్నా.. మీ అందరి అభిప్రాయాన్ని పరిశీలించి మూడు, నాలుగు రోజుల్లో ఏ పార్టీలో చేరతాననే విషయం అందరికీ చెబుతా. నిర్ణయం నా మదిలో ఉన్నా.. ఇపుడే ప్రకటించలేక పోతున్నా. రాష్ట్ర రాజకీయాలను దృష్టిలో పెట్టుకొనే ఆ విషయాన్ని చెప్పటంలేదదు.. రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబ నుంచి ప్రజలకు విముక్తి రావాలంటే.. రాష్ట్ర మొత్తం మనలాంటి ఆలోచన ఉన్న వ్యక్తులని సమీకరించల్సిన అవసరం ఉంది.

Bandi Sanjay : తెలంగాణకు మెడికల్ కాలేజీలు మంజూరు చేసిన కేంద్రానికి ధన్యవాదాలు..

రహస్య ప్రాంతాల్లో ఇప్పటి వరకు అర్ధరాత్రి వరకు ఇతర నేతలతో చర్చలు జరిపి.. మాట్లాడి ఏకం చేస్తున్నా. హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టీ.. మూడు నాలుగు రోజుల్లో నిర్ణయం చెబుతా. ఎక్కడో కాదు.. ఖమ్మం నడి బొడ్డున కనీ వినీ ఎరుగని రీతిలో బహిరంగ సభ పెట్టీ మరీ ప్రకటిస్తా. రెండు మూడు రోజుల్లో ఢిల్లీలో ముఖ్య నాయకులతో మాట్లాడి బహిరంగ సభ తేదీ ప్రకటిస్తాను. నన్ను నా స్థాయిలో ఇబ్బంది పెడుతున్నారు.. ఇంకా ఒకటి, రెండు నెలలు మిమ్మల్ని కూడా ఇబ్బంది పెడతారు. మీరు పెట్టే ఇబ్బందులు.. నా వెంట్రుకతో సమానం” అంటూ పరోక్షంగా బీఆర్ఎస్ నేతలకు వార్నింగ్ ఇచ్చారు.