Bandi Sanjay : తెలంగాణకు మెడికల్ కాలేజీలు మంజూరు చేసిన కేంద్రానికి ధన్యవాదాలు..

మెడికల్ కాలేజీ ఏర్పాటుకు సిద్దమని కేంద్రం లేఖ రాసినా తెలంగాణ ప్రభుత్వం స్పందించలేదని..కేంద్రం సహకరించడం లేదని చెప్పడం సిగ్గు చేటని అన్నారు. 

Bandi Sanjay : తెలంగాణకు మెడికల్ కాలేజీలు మంజూరు చేసిన కేంద్రానికి ధన్యవాదాలు..

Bandi Sanjay

Bandi Sanjay : దేశంలో కొత్తగా 50 వైద్య కళాశాలలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వీటిలో 18 కాలేజీలు తెలుగు రాష్ట్రాలకు అనుమతి ఇచ్చింది. వీటిలో 13 తెలంగాణకే ఇచ్చింది. దీనిపై తెలంగాణ చీఫ్ బండి సంజయ్ కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ గారికి, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మన్సుక్ ఎల్.మాండవీయ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అని తెలిపారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు మంజూరు చేసిన కేంద్ర నికి సంజయ్ ధన్యవాదాలు అని తెలిపారు.

 

అదే సందర్భంలో మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వంపైనా..సీఎం కేసీఆర్ పైనా విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు సహకరించటంలేదని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తుంటారు.సహకరించపోతే ఇన్ని మెడికల్ కాలేజీలకు అనుమతి ఇస్తుందా?దీనిపై బీఆర్ఎస్ నేతలు ఏం మాట్లాడతారు? అంటూ ప్రశ్నించారు.తెలంగాణాకు 13 మెడికల్ కాలేజీలకు అనుమతి ఇవ్వడం హర్షణీయం అని..కరీంనగర్ కు ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు సంతోషమని అన్నారు బండి. మెడికల్ కాలేజీ ఏర్పాటుకు సిద్దమని కేంద్రం లేఖ రాసినా తెలంగాణ ప్రభుత్వం స్పందించలేదని..కేంద్రం సహకరించడం లేదని చెప్పడం సిగ్గు చేటని అన్నారు. తెలంగాణ అభివృద్ధి చేయాలనే చిత్తశుద్ధి కేంద్ర ప్రభుత్వానికి ఉందని చెప్పటానికి 13 మెడికల్ కాలేజీలకు అనుమతి ఇవ్వటం నిదర్శనమన్నారు.

 

Medical Colleges: దేశంలో కొత్తగా మరో 50 వైద్య కళాశాలలకు కేంద్రం ఆమోదం
తెలంగాణ అభివృద్ధికి.. సంక్షేమం విషయంలో కేంద్రం ప్రత్యేక నిధులిస్తోందని కానీ..రాష్ట్ర ప్రభుత్వం అబద్ధాలు చెబుతోంది అంటూ ఆరోపించారు. కేంద్రానికి సహకరించకపోయినా తెలంగాణ ప్రజలపట్ల మోదీగారికి ఉన్న అభిమానంతో తెలంగాణ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని అన్నారు. మెడికల్ కాలేజీల ఏర్పాటు విషయంలో కేంద్రం సహకరించలేదని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం పచ్చి అబద్దం అని నిరూపితమైందన్నారు. ఈ విషయంలో సైంధవుడులా అడ్డుకున్న కేసీఆర్ తిరిగి కేంద్రం సహకరించలేదనడం సిగ్గు చేటని ఈ సందర్భంగా బండి సంజయ్ దుయ్యబట్టారు.