Raghunandan Rao: ఈ ప్రశ్నలకు కాస్త సమాధానం చెబుతారా?: బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు

Raghunandan Rao: ఆ విషయంలో వచ్చిన రూ.7,380 కోట్ల రూపాయల ఆదాయంపై కేటీఆర్ ఎందుకు కనీసం ట్విట్టర్లో కూడా స్పందించలేదు? అని రఘునందన్ రావు ప్రశ్నించారు.

Raghunandan Rao: ఈ ప్రశ్నలకు కాస్త సమాధానం చెబుతారా?: బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు

Raghunandan Rao

Raghunandan Rao: ఓఆర్ఆర్ టోల్ కాంట్రాక్ట్ కు బేస్ ప్రైస్ ఎందుకు ఫిక్స్ చేయలేదని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించారు. ఇవాళ ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… ఓఆర్ఆర్ (ORR)పై వాహనాల రాకపోకలు, ఆదాయంపై అధ్యయనానికి ఓ కంపెనీకి రూ.4 కోట్లు ఇచ్చి రిపోర్ట్ తీసుకున్నారని, ఆ రిపోర్ట్ ఎక్కడ అని ప్రశ్నించారు.

“ఆ తర్వాత మరో సంస్థకు రూ.80 లక్షలు ఇచ్చి… రిపోర్ట్ తీసుకున్నారు. ఏప్రిల్ 30వ తేదీన ఓఆర్ఆర్ టోల్ ద్వారా 2 కోట్ల 2 లక్షల రూపాయలు వచ్చింది. ఏప్రిల్ నెలలో సగటున రోజుకు కోటి 80 లక్షల రూపాయలు వచ్చింది. ఈ ఏడాదికి 720 కోట్ల రూపాయల ఆదాయం రావాలి. ఓ కంపెనీని 2017లో డిఫాల్టర్ జాబితాలో HMDA పెట్టింది.. ఆ జాబితాలో ఉన్న కంపెనీకి ఇప్పుడు ఎలా కాంట్రాక్ట్ ఎలా ఇచ్చారు?

బేస్ ప్రైస్ లేకుండా ఎందుకు టెండర్ పిలిచారు? 11 ఏప్రిల్ రోజు కాంట్రాక్ట్ ఫైనల్ చేసి.. 27 ఏప్రిల్ న ప్రెస్ రిలీజ్ చేశారు. HMDA కమిషనర్ అరవింద్ కుమార్ కాల్ డేటా బయటపెట్టాలి. గతంలో రూ.87 లక్షలు కట్టలేనని చేతులు ఎత్తేసిన కంపెనీకి తిరిగి టెండర్ ఎలా ఇచ్చారు?

క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న కంపెనీకి ఎలా కాంట్రాక్ట్ ఇచ్చారు? 7,380 కోట్ల రూపాయల ఆదాయంపై కేటీఆర్ ఎందుకు కనీసం ట్విట్టర్లో కూడా స్పందించలేదు? ORR కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. ORR టోల్ ఫీజు తగ్గించి సామాన్యులకు మేలు చేయాలి. ORR టోల్ టెండర్ రద్దు చేయాలి.

రోజూ వచ్చే 2 కోట్ల రూపాయలు వచ్చే ORR ఆదాయంలో కోటి ముప్పై లక్షల రూపాయలు ఎక్కడ డైవర్ట్ చేస్తున్నారు. ఈడీకి ఫిర్యాదు చేస్తాం. కోర్టుకు వెళ్తాం. కర్ణాటక ఎన్నికలు అయితే నెట్టిలేనివారు మహారాష్ట్రకు ఎందుకు పోతున్నారు? ఓ కంపెనీ ఉన్నది కాబట్టే BRS నేతలు మహారాష్ట్రకు వెళ్లారు” అని రఘునందన్ రావు అన్నారు.

Balineni Srinivasa Reddy : సీఎం జగన్‌తో మాజీమంత్రి బాలినేని కీలక భేటీ